ఏపీ కేబినెట్ కొలువుదీరింది. 25మందితో కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది.కానీ సామాజిక వర్గాల లెక్కలతో కొందరు సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదు. చిత్తూరు జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ ఆశించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నిరాశే మిగిలింది. వైఎస్ జగన్ భాస్కర్ రెడ్డికి రెండు కీలక పదవులు అప్పగించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఏపీ ప్రభుత్వ విప్ పదవి దక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెవిరెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. సీనియర్ కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించినా.. కొన్ని సమీకరణాలతో దక్కలేదు. దీంతో చెవిరెడ్డికి రెండు కీలక పదవులు అప్పగించారు జగన్. సామాజిక వర్గాల లెక్కలతో చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవి దక్కింది. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామికి.. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. ఈ జిల్లా నుంచి మొత్తం నలుగురు పదవులు ఆశించగా ఇద్దరికి దక్కాయి. చంద్రగిరి నుంచి గెలిచిన చెవిరెడ్డి, నగరి నుంచి గెలిచిన రోజాలకు నిరాశ తప్పలేదు.