YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కంగారులను వేటాడేసారు

కంగారులను వేటాడేసారు

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో: 

ప్రపంచకప్‌పై కన్నేసిన కోహ్లీసేనకు స్ఫూర్తినిచ్చే, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే విజయం. బలమైన ఆస్ట్రేలియాను ఆదివారం 36 పరుగుల తేడాతో ఓడించింది భారత్‌. శిఖర్‌ ధావన్‌ (117; 109 బంతుల్లో 16×4) అద్భుత శతకానికి.. విరాట్‌ కోహ్లి (82; 77 బంతుల్లో 4×4, 2×6), రోహిత్‌శర్మ (57; 70 బంతుల్లో 3×4, 1×6), హార్దిక్‌ పాండ్య (48; 27 బంతుల్లో 4×4, 3×6) సమయోచిత ఇన్నింగ్స్‌లు తోడవడంతో మొదట టీమ్‌ఇండియా 5 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా గట్టిగానే పోరాడినా.. చివర్లో వికెట్లు కోల్పోయి, సరిగ్గా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (69; 70 బంతుల్లో 5×4, 1×6) టాప్‌స్కోరర్‌. భువనేశ్వర్‌ (3/50) బుమ్రా (3/61), చాహల్‌ (2/62) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. టోర్నీలో భారత్‌కిది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌లో  దక్షిణాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే. భారత్‌ గురువారం తన తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది.

 

Related Posts