యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
దక్షిణాది నటుడు గిరీశ్ కర్నాడ్ ఈ ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. మహారాష్ట్రలోని మాతేరన్ లో 1938 మే 19న జన్మించిన గిరీశ్ కర్నాడ్, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి ఈ ఉదయం 6.30 గంటల సమయంలో మృతిచెందారు. 1998లో జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. చివరిగా ఆయన సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ జిందా హై' చిత్రంలో రా చీఫ్ గా నటించారు. గిరీశ్ కర్నాడ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. పలువురు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.