YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేశినేని, దేవినేని మధ్య నలుగుతున్న బాబు

కేశినేని, దేవినేని మధ్య నలుగుతున్న బాబు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేశినేని నాని. గ‌డిచిన నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నానికి కేంద్రంగా ఉన్న విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ. 2014 లో టీడీపీ టికెట్ పై ఇక్కడి నుంచే విజ‌యం సాధించిన ఆయ‌న తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వాను త‌ట్టుకుని మ‌రీ విజ‌యం సాధించారు. రాజ‌కీయ ఉద్ధండులే కుప్పకూలిపోయిన ఈ ఎన్నిక‌ల్లో సునామీ నుంచి బ‌య‌ట‌ప‌డి .. త‌న ప‌రువును, పార్టీ ప‌రువును కాపాడిన నాయ‌కుడిగా ఆయ‌న పేరుతెచ్చుకున్నారు. అయితే, ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. తాజాగా మాత్రం నాని వివాదాల‌కు కేంద్రంగా మారారు. నేరుగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్ చేసుకున్నారు.పార్టీ పార్లమెంట‌రీ ప‌ద‌వుల కేటాయింపు విష‌యంలో త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వక‌పోవ‌డంతో ఒక్కసారిగా అలిగిన నాని.. అధినేత‌కు షాకిచ్చారు. అయితే, దీనిని ప‌సిగ‌ట్టిన చంద్రబాబు.. పార్లమెంట్‌లో విప్ ప‌ద‌విని నానికి కేటాయించారు. అయితే, దీనిని త‌న‌కు వ‌ద్దని ఖ‌రాఖండీగా చెప్పిన నాని.. త‌న‌క‌న్నా స‌మ‌ర్ధుల‌కే ఈ ప‌ద‌వి ఇవ్వాల‌ని ఫేస్‌బుక్ వేదిక‌గా చేసిన ప్రకట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో అల‌జ‌డి రేపింది. దీనికి ముందు.. పార్లమెంటు ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న నేరుగా నాగ‌పూర్‌కు వెళ్లి.. అక్కడ గెలిచిన బీజేపీ నాయ‌కుడు, కేంద్మంత్రి గ‌డ్కరీకి పుష్ఫగుచ్ఛం అందించి
శుభాకాంక్షలు చెప్పడం మ‌రింత గంద‌ర‌గోళానికి దారి తీసింది.చంద్రబాబు హుటాహుటిన నానితో భేటీ అయి.. రాజ‌కీయ ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఎవ‌రూ సీనియ‌ర్ కాదు.. ఎవ‌రూ జూనియ‌ర్ లేరు..
అని బుజ్జగించారు. అప్పటికి త‌లవూపి బ‌య‌ట‌కు వ‌చ్చిన నాని.. త‌ర్వాత అధినేత ప‌ట్ల విధేయ‌త ప్రద‌ర్శిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, నాని మాత్రం ఎక్కడా వెన‌క్కి త‌గ్గిన ప‌రిస్థితి
క‌నిపించ‌లేదు. గురువారం ఫేస్‌బుక్‌లో మ‌రో పోస్టింగ్ చేశారు. పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు త‌ప్ప- అని నాని పోస్ట్ చేయ‌డంతో ఆయ‌న నేరుగా ఎవ‌రిమీద యుద్ధం చేస్తున్నారో ఇట్టే అర్ధమ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మరోవైపు కేశినేని శ్రీనివాస్‌ సన్నిహితులు, ముఖ్య అనుచరులు మాత్రం నాని ట్వీట్‌లో అర్థం ఉందని అంటున్నారు.తెలుగుదేశం పార్టీలో చేరిన కోటరీలపై నాని పోరాటం చేస్తున్నారని, కోటరీల వల్లే పార్టీకి నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని పూడ్చాలన్న తలంపుతో నాని ఉన్నారని అంటున్నారు. నాని ప్రయత్నాల పట్ల ఇష్టంగా లేని కోటరీలు తమ నాయకుడిని బీజేపీలోకి వెళ్లిపోతున్నాడంటూ అబద్ధపు ప్రచారాలకు దిగుతూ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నాని మాత్రం పార్టీ మారడని, కోటరీల నుంచి పార్టీని రక్షించేందుకు పోరాటం చేస్తారని చెబుతున్నారు. అయితే, ఈ పోరాటం ఎన్నాళ్లు? అనేది మ‌రో ప్ర‌శ్న‌. నేరుగా అధినేత‌కే విష‌యం చెబితే స‌రిపోతుంది క‌దా? అనేవారు కూడా ఉండ‌డం
గ‌మ‌నార్హం.వాస్తవంగా చూస్తే కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఎవ‌రూ ఔన‌న్నా.. కాద‌న్న మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావుకే తొలి ప్రయార్టీ ఇస్తారు.. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. గెలిచిన త‌న క‌న్నా.. ఓడిన ఉమాకే ప్రయార్టీ ఇవ్వడం నానికి న‌చ్చలేద‌ని తెలుస్తోంది. ఐదేళ్ల పాటు ప్రతిప‌క్షంలో ఉండి ఎన్నో పోరాటాలు చేసినా మ‌ళ్లీ ఐదేళ్ల త‌ర్వాత పార్టీ గెలిస్తే మ‌ళ్లీ ఉమా హ‌వానే ఉంటుంద‌ని.. అలాంట‌ప్పుడు తాము గెలిచి.. పోరాటాలు చేసి ఉప‌యోగం ఏంట‌న్నది నాని ప్రశ్న అట‌. ఇక గ‌ల్లా ఫ్యామిలీకి పార్టీలో రెండు కీల‌క ప‌ద‌వులు ఇవ్వడం కూడా ఆయ‌న మ‌రో అసంతృప్తికి కార‌ణంగా తెలుస్తోంది. అదే టైంలో విజ‌య‌వాడ‌లో పార్టీ కార్యక‌లాపాల కోసం ముందుగా త‌న ఆఫీస్‌ను వాడుకున్న టీడీపీ అధిష్టానం ఆ త‌ర్వాత ఉమా సూచ‌న‌ల మేర‌కు గొల్ల‌పూడిలోని టీడీపీ ఆఫీస్‌కు కార్యక‌లాపాలు మార్చుకోవ‌డం కూడా నానికి న‌చ్చలేద‌ట‌. ఈ విష‌యంలో త‌న‌కు ఓ మాట కూడా చెప్పలేద‌న్నదే నాని తీవ్ర ఆవేద‌న‌కు కార‌ణం.ఇక ఈ ఎన్నిక‌ల‌కు ముందు మూడేళ్లుగా నాని, ఉమా మ‌ధ్య పెద్ద కోల్డ్‌వార్ న‌డిచింది. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించేందుకు ప్రయ‌త్నాలు చేసిన ఉమాను బాబు నెత్తిన పెట్టుకోవ‌డం నానికి పూర్తిగా న‌చ్చడం లేదు. ఇదిలా ఉంటే ఐదేళ్ల పాటు
ప్రతిప‌క్షంలో ఉన్న పార్టీని బ‌తికించాలంటే ఇప్పుడు మంత్రిగా ప‌నిచేసిన ఉమా లాంటి వాళ్లే బాబుకు అవ‌స‌రం. వాళ్లే ప‌ద‌వుల్లో ఉన్నందున ఐదేళ్ల పాటు చాలా ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఉమాకే బాబు ప్రయార్టీ ఉంటుంది. నాని అల‌క కామ‌న్‌. మ‌రి వీరి మ‌ధ్యలో న‌లిగిపోతోన్న బాబు ఈ గొడ‌వ‌కు ఎలా చెక్ పెడ‌తారో ? చూడాలి.

Related Posts