ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. రెండోసారి అదికారంలోకి రావాలని చేసిన ప్రయత్నంలో టీడీపీ బొక్కబోర్లా పడింది. అనేక సంక్షేమ పథకాలు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు చేరువ కావడం వంటి అనేక చర్యలు తీసుకున్నా.. ఏ ఒక్కటి కూడా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురాకపోగా.. గౌరవ ప్రదమైన సీటను కూడా సాదించుకునే పరిస్థి తిని లేకుండా చేసింది. కేవలం 23 స్థానాలకే పరిమితమైన ఈ పార్టీకి ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోక తప్పని పరిస్థితి. అయితే, ఈ ఐదేళ్లు నెట్టుకు వచ్చేది ఎలా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాదు, పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబుపై కూడా ఇప్పుడు విమర్శల పవనాలు వస్తున్నాయి.ప్రస్తుతం బాబు వయసు 70కి చేరువ అవుతోంది. ఆ లెక్కన చూసుకుంటే.. ఈ ఐదేళ్ల తర్వాత ఆయన వయసు ఖచ్చితం గా 75కి చేరువ అవుతుంది. ఆ సమయానికి పార్టీని పరుగులు పెట్టించడం, అధికారంలోకి తీసుకు రావడం వంటి కీలక విషయాల్లో ఆయన చురుగ్గా వ్యవహరిస్తారా? అనే సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చింది. యువ నాయకుడిగా పార్టీ అధినేత జగన్.. ప్రజలకు చేరువయ్యారు. తాజా ఎన్నికల్లో ఊహించని విజయం సాధించడం వెనుక ఖచ్చితంగా జగన్
ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉందనడంలో సందేహం లేదు. యువ నాయకుడిగా ప్రజలు ఆయనకు పట్టం కట్టారనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి.ఈ సారి యువత ఓట్లు ముందుగా జగన్‌కు ఆ తర్వాత పవన్‌కు పడ్డాయి. యువత ఓట్లు దక్కించుకునే క్రమంలో ఈ సారి టీడీపీ మూడో స్థానంలో ఉంది. టీడీపీ ఓటమికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే కుప్పంలో చంద్బాబు మెజార్టీ బాగా పడిపోవడానికి కూడా యువత, కొత్తగా చేరిన ఓటర్లు అందరూ వైసీపీకి ఓట్లేయడమే ప్రధాన కారణం. దీనిని దృష్టిలో పెట్టుకుంటే.. టీడీపీ పరిస్థితి ఏంటి? జగన్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల నాటికి కూడా చంద్రబాబే ఉంటారా? లేక యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి.. తాను బయట నుంచి పర్యవేక్షిస్తారా? అనేది ఇప్పుడు కీలక ప్రశ్న.జగన్‌కు సమాంతరంగా యువ నాయకుడిని చూసుకోకపోతే.. పార్టీ మొత్తానికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. ఒడిశా ప్రజల మాదిరిగా కురువృద్ధుడినే సీఎంగా చూసుకోవాలని ఏపీ ప్రజలు భావించడం లేదు. పైగా 2024 నాటికి పుంజుకునే రేంజ్‌లో ఉండాలని జనసేన అధినేత, యువ హీరో.. పవన్ కూడా భావిస్తున్నారు. ఒక పక్క అధికార వైసీపీ, మరోపక్క ప్రతిపక్షం జనసేనల మధ్య టీడీపీ పుంజుకోవాలంటే.. తక్షణమే చంద్రబాబు తన పదవిని యువ నాయకత్వానికి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్టీ నేతలే ఈ తరహా ఆలోచనలు చేస్తున్నారంటే.. పరిస్థితి ఎలా ఉంద ో అర్ధం చేసుకోవచ్చు. మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? చూడాలి.