YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

పార్లమెంట్ లో తెలంగాణ గొంతువినిపిస్తాం

Highlights

  • ప్రధానిని కించపరిచే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు
  • బీజేపీ రాద్ధాంతం తగదు
  • రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేసే విధానాలేవీ?
  •  నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
పార్లమెంట్ లో తెలంగాణ గొంతువినిపిస్తాం

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై గళమెత్తుతామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని, తమ వాదన వినిపించామని గుర్తుచేశారు. శనివారం ఆమె   మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి పార్లమెంట్‌లో ప్రారంభమయ్యే బడ్జెట్ రెండోవిడుత సమావేశాల్లో ప్రతిశాఖకు సంబంధించిన కేటాయింపులపై చర్చిస్తామన్నారు. ముఖ్యంగా  పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందేమీ లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని ప్రధాని చెప్తున్నారుకానీ, ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదని విమర్శించారు. వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టామని చెప్పుకున్నా...గత సంవత్సరం కంటే కేటాయింపులు ఏ మాత్రం పెరుగలేదన్నారు. కేంద్రం అమలుచేస్తున్న పంట బీమా పథకంతో రైతులకు మేలు జరుగడంలేదని, రైతు యూనిట్‌గా పంట బీమాను అమలుచేస్తే లబ్ధిచేకూరుతుందని చెప్పారు. .ఏపీ విషయంలోనూ అదే చెబుతున్నామని స్పష్టంచేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రధాన హామీలైన హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నందున ఆ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కించపరిచే ఉద్దేశ్యం  సీఎం కేసీఆర్‌కు లేదని, కరీంనగర్‌లో గంటన్నరకుపైగా సాగిన ముఖ్యమంత్రి ప్రసంగంలో అనుకోకుండా పొరపాటు జరిగిందే తప్ప, కావాలని అనలేదని ఆమె స్పష్టంచేశారు.
ప్రధానమంత్రిని అవమానించాలనే సంకుచిత ధోరణి సీఎం కేసీఆర్‌కు లేదని, ఎప్పుడూ ఉండదని ఎంపీ కవిత స్పష్టంచేశారు. దేశ ప్రధానిని అవమానపరిస్తే దేశాన్ని అవమానించినట్టుగానే భావిస్తామని, అలాంటిది ప్రధానిని ఏ విధంగా వ్యక్తిగతంగా విమర్శిస్తారని అనుకుంటున్నారని అన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య వేదికలో ఆరువందల కోట్ల ప్రజలు తనకు ఓటువేసినట్టు పేర్కొన్నారని, కానీ భారతదేశ జనాభానే 130 కోట్లు అనే విషయాన్ని తాము ఎక్కడా ప్రస్తావించలేదని, దాన్ని తాము తప్పు పట్టలేదన్నారు. ఇలాంటి చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయని, అంత మాత్రాన రాద్ధాంతం చేయడం తగదని హితవుచెప్పారు..పేద ప్రజలకు, రైతాంగానికి బీజేపీ, కాంగ్రెస్ ఏమీచేయలేదని చెప్పడమే సీఎం కేసీఆర్ ఉద్దేశ్యమని  కవిత వివరించారు. 

Related Posts