యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మోడీ రాజకీయం అంతు చిక్కడం కష్టమే. పక్కా ప్లాన్ ప్రకారం ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తూ వస్తున్నారు. 2019లో ఎవ్వరూ ఊహించని విధంగా కేంద్రంలో ఫుల్ మెజారిటీ సాధించిన బీజేపీ మరిన్ని రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తోంది. ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలుపెట్టింది. దీనికోసం అపుడపుడు రాముడు మంచి బాలుడు అన్నట్లు నటిస్తూ ఉంటుంది. విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయడం అలాంటిదే. విపక్షాన్ని ఎన్నికల్లోనే చిత్తు చేసిన బీజేపీ... సభలోనూ తనకు తిరుగు లేకుండా చూసుకునే క్రమంలో వేసిన నయా ప్లాన్ ఇది. గతంలో కూడా ఇదే ప్లాన్ వేసి సక్సెస్ అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కాంగ్రెస్ ఈ ఆఫర్ వాడుకోకుండా డీఎంకే పార్టీకి వదిలేసింది. దానికి బదులు డీఎంకే కోటాలో మన్మోహన్ సింగ్ కు రాజ్యసభ పదవి అడుగుతోంది. డీఎంకే తరఫున తొలిసారి లోక్ సభకు ఎన్నికయిన కనిమొళి ఈ పదవిని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆమె రాజ్యసభలో ఉండేది. అంటే ఒక్క పదవితో మూడు పార్టీలు లబ్ది పొందుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్-డీఎంకే మూడూ హ్యాపీ. చిత్రమేంటంటే... 2014లోనూ విపక్ష కూటమిలోని డీఎంకే ఎంపీ తంబీదురైకి డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగించింది. ఇప్పుడు
కూడా ఇదే ప్లాన్. బహుశా భవిష్యత్తులో బీజేపీ డీఎంకే దోస్తీ కోరుకుని తమిళనాడులో ప్రవేశించే ప్రయత్నం చేస్తోంది. అయితే, బీజేపీ మిత్రపక్షం శివసేన ఆ పదవిని ఆశించింది. తాజా షాక్ తో ఆ శివసేన ఖంగుతినిందనే చెప్పాలి. వాస్తవానికి ఇటీవలే డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు కేటాయించాలని మోదీని శివసేన అడిగింది. అయినా వాళ్లకు ఏం చెప్పకుండా విపక్షాలకు ఇచ్చేశారు మోడీ. మరి శివసేన ఎలా రియాక్టవుతుందో చూడాలి.