YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మరుగుదొడ్ల సమస్య పరిష్కరిస్తాం.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ

మరుగుదొడ్ల సమస్య పరిష్కరిస్తాం.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

స్థానిక దానవాయిపేట ఎస్‌కెవిటి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. విద్యార్థులు మరుగుదొడ్లు సౌకర్యం లే ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి సోమవారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లను పరిశీలించి ఓఎన్‌జిసి సిఎస్‌ఆర్‌ నిధుల సహకారంతో వాటిని త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పాఠశాలలోని మరుగు దొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటి కారణంగా విద్యార్ధినులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని బాలల స్నేహ పూర్వక రాజమహేంద్రవరం వారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దృష్టికి సమస్య తీసుకువచ్చారు.  మరుగు దొడ్లను పున నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.  వారిని సంప్రదించి త్వరిత గతిన నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. 10లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు కృషి చేయాలని తమవంతుగా అవసరమైన సహకారం అందిస్తామని ప్రధానోపాధ్యాయురాలు రాజకుమారికి సూచించారు. అందుకు అవసరమైన ఏర్పాటు తాము అందిస్తామన్నారు. ఉపాధ్యాయుల జీతాల ఇబ్బందులను పరిష్కరించేందుకు హితకారిణి సమాజం కమిటీ తీర్మానం చేసిందని ఎన్నికల నిర్వహణ వల్ల ఆలస్యమైందన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. హితకారిణి సమాజం ఛైర్మన్‌ యాళ్ల ప్రదీప్‌సుకుమార్‌, డైరెక్టర్‌ మేడపాటి సాయిభాగ్యలక్ష్మి తదితరులు వారి వెంట ఉన్నారు. అనంతరం ఓఎన్‌జిసి బేస్‌ కాంప్లెక్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌పి పటేల్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఆ సమస్య పరిష్కరించేందుకు సహకరిస్తామని ఇడి వారికి హామీ ఇచ్చారు.

Related Posts