యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే ఆశా వర్కర్ల జీతాలు రూ.3వేలు నుంచి రూ.10వేలకు పెంపుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ పెంపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కూడా మంత్రివర్గం సుముఖత వ్యక్తం చేసింది. వీలైనంత త‍్వరలో అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలుపై మంత్రివర్గంలో చర్చ కొనసాగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డుల వేతనాల పెంపునకు సంబంధించి ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హోంగార్డుల జీతాల పెంపుపైనా సమావేశంలో చర్చి జరిగింది. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన కేబినెట్.. విలీన ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో రైతు సమస్యలు, ప్రభుత్వం చేపట్టబోయే పథకాలపై ప్రస్తావన వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా అమలుపై కేబినెట్‌లో ముఖ్యమంత్రి జగన్ మంత్రులతో చర్చించారుఅక్టోబరు 15 నుంచి ఏడాదికి రూ.12,500లు రైతుకు సాయంగా అందించే 'రైతు భరోసా' పథకానికి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.మరోవైపు, ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. అయితే, దీనిపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకెళ్లనున్నారు. వీలైనంత త్వరగా ప్రక్రియ మొదలుపెట్టాలని, తద్వారా ఆర్టీసీపై వస్తున్న అపోహలను, ఆర్టీసీ ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలని జగన్ సర్కారు భావిస్తోంది. క్యాబినెట్ భేటీ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా అమలుపైనా ఎక్కువసేపు చర్చ జరిగినట్టు తెలుస్తోంది.