YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కథువా కేసులో ఆరుగురు దోషులే

కథువా కేసులో ఆరుగురు దోషులే

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా చిన్నారి హత్యాచార కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగుర్ని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధరించింది. ఈ కేసులో నిందితులను ఒక్కొక్కరిగా పఠాన్‌కోట్ జిల్లా సెషన్స్ జడ్జ్ తేజ్వీందర్ సింగ్ విచారించారు. వీరి విచారణ జూన్ 3తో ముగియగా, తీర్పును రిజర్వులో ఉంచారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు దోషులకు శిక్ష ఖరారు చేయనున్నారు. న్యాయమూర్తి సమక్షంలో జరిగిన ఈ విచారణ మొత్తం వీడియోగా చిత్రీకరించారు. ఏనిమిదేళ్ల చిన్నారిని గతేడాది జనవరి 10న అపహరించిన కామాంధులు ఓ గుడిలో నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల పాటు చిన్నారికి నరకం చూపించి, అత్యంత హేయంగా ప్రవర్తించారు. తలపై బలంగా కొట్టి, కాళ్లు, చేతులు విరిచి పైశాచికంగా వ్యవహరించారు. ఈ ఘటనను యావత్తు భారతావనే కాదు, ప్రపంచ దేశాలు కూడా ముక్తకంఠంతో ఖండించాయి. చిన్నారి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాలతో జమ్మూ కశ్మీర్ బయట విచారించారు. గతేడాది జూన్ తొలి వారంలో పఠాన్‌కోట్ జిల్లా సెషన్స్ కోర్టుకు ఈ కేసు విచారణ బాధ్యతలను అప్పగించారు. క్రైం బ్రాంచ్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రధాన నిందితులుగా సాంజీ రామ్, అతడి కుమారుడు సోనూ విశాల్, అతడి మేనల్లుడు ఆనంద్ దత్తాతోపాటు ఇద్దరు పోలీసులు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో కీలక ఆధారాలను నాశనం చేసుందుకు పోలీసులు నిందితుల నుంచి రూ.4 లక్షలు తీసుకున్నట్టు తెలిపారు. మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో ఏడుగుర్ని చార్జ్ షీట్‌లో చేర్చారు. నిందితులపై రణబీర్ పీనల్ కోడ్, నేరపూరితమైన కుట్ర, హత్య, సామూహిక అత్యాచారం లాంటి తీవ్రమైన కేసులను చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అలాగే, పోలీసులు రాజ్, దత్తాలపై 161 సెక్షన్లను అదనంగా నమోదుచేశారు. నిందితులను గురుదాస్‌పూర్ జైలుకు తరలించి కొద్ది మంది సమక్షంలోనే విచారణ జరిపించారు. గుర్రాలను మోపుతున్న బాలికను మాయమాటలు చెప్పి అపహరించినట్టు అందులో స్పష్టం చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన ఆ బాలికను పథకం ప్రకారమే అపహరించి హత్యాచారం చేశారు. ఈ కేసులో నాటి పీడీపీ-బీజేపీ సర్కారులోని ఇద్దరు మంత్రులకు ప్రమేయం ఉందని వివరించారు. నిందితుల అరెస్టును నిరసిస్తూ వారికి మద్దతుగా హిందూ ఏక్తా మంచ్ నిర్వహించిన ర్యాలీలో బీజేపీకి చెందిన మంత్రులు చౌదరి లాల్ సింగ్, చందేర్ ప్రకాశ్ గంగాలు పొల్గొన్నారు.

Related Posts