Highlights
- అనుభవజ్ఞుడనే మద్దతు ఇచ్చా..
- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
- జేఎఫ్‌సీ సుదీర్ఘ భేటీ
- పవన్ కళ్యాణ్
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలను గందరగోళ పరుస్తాయని చెప్పారు. ప్రజల్లో అయోమయ వాతావరణం సృష్టించడం సరికాదన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సీ) శనివారం హైదరాబాదులోని హోటల్ ఆవాస్‌లో సుదీర్ఘంగా భేటీ అయింది. భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.చంద్రబాబే కన్ఫ్యూజన్‌లో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. జేఎఫ్‌సి ప్రధానంగా 11 అంశాలను గుర్తించిందని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ కన్ఫ్యూజన్, అయోమయానికి గురి చేస్తోందని, కావాలని చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలకు న్యాయం చేసేందుకు చంద్రబాబుకు నాలుగేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మీపై నమ్మకం ఎలా కలుగుతుందన్నారు. రాష్ట్రం నాలుగేళ్లు ఉదాసీనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు ఇన్నాళ్లు ఎందుకు బలంగా అడగలేకపోయారని పవన్ నిలదీశారు.తాను టీడీపీకి పార్ట్‌నర్ అని, బీజేపీకి పార్ట్‌నర్ అని కొందరు ప్రచారం చేస్తున్నారని, దానిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి అభినందనలని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలన్నారు. తాము నైతిక బాధ్యతతో జేఎఫ్‌సీని ఏర్పాటు చేశామన్నారు. తాను టీడీపీకి పార్ట్‌నర్ అని, బీజేపీకి పార్ట్‌నర్ అని కొందరు ప్రచారం చేస్తున్నారని, దానిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. 2014లో తాను చంద్రబాబు అనుభవజ్ఞుడు అనే ఉద్దేశ్యంతోనే బీజేపీ, టీడీపీకి మద్దతు పలికానని చెప్పారు. ఒకర్ని తప్పు పట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. సీఎం అనుసరిస్తున్న విధానం సరైంది సరికాదన్నారు.విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రజలను కదిలించారు కాని, స్థిరాస్థి ఇక్కడే ఉండిపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. స్థిరాస్తి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని చెప్పారు. విభజనలో రాజకీయ నాయకుల పాత్ర ఉంది కానీ, ప్రజల పాత్ర లేదన్నారు. ఇరు ప్రాంత ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేలా ఎవరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.