యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 9 లక్షల మంది 20 లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్లు ఇవ్వాలని కాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బాధితుల తరుపున ధన్యవాదాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. మా నిరంతర పోరాటానికి ఫలితమే ఈ నిర్ణయం. మల్టీ లెవెల్ స్కీం ల వల అమాయకులు మోసపోయి ,ఆర్ధికంగా నష్టపోతున్నారని అయన అన్నారు. గతంలో 250 కోట్లు ఇస్తున్నామని దీక్ష విరమింపజేశారు,కానీ ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం 1150 కోట్లు ఇస్తామనడం చిన్న విషయం కాదు. ఇప్పుడున్న మంత్రులు ఎదో ఒక దశలో మా ఉద్యమంలో పాల్గొన్న వారే. బినామీ ఆస్తులను కూడా వెంటనే అటాచ్ చేయాలని అయన అన్నారు. ఈ తరహా మార్కెటింగ్ కంపెనీలను పూర్తిగా రద్దు చేయాలని అన్నారు.
సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ నిధులు మంజూరు చేయడమే కాకుండా ఖచ్చితంగా బాధితులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలి.అనేక మంది బాధితుల వద్ద రశీదులు లేవు, కంపెనీ లో డేటా ఆధారంగా చెల్లింపు చేయాలని అన్నారు. 1150 కోట్లతో సమస్య పరిష్కారం కాదు. అనేక మంది బాధితులు లక్షల్లో డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి బాదితుడికి న్యాయం జరిగెలా చర్యలు తీసుకోవాలని కోరారు.