ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకానికి తెరతీసిన 15వ శాసనసభ కొలువుదీరింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 11.05 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. జాతీయగీతంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ముఖ్యమంత్రి, సభానాయకుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మొదటగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం సభ్యులతో అక్షర క్రమంలో పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే అంటూ.. దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడిని మర్యాదపూరకంగా కలిసి అభివాదం చేశారు. రిజిస్టర్‌లో సంతకం చేశారు.ఆ తర్వాత ఎన్ చంద్రబాబునాయుడి అనే నేను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దైవసాక్షిగా ప్రమాణం చేశారు.