ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ అయ్యారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం
అనంతరం సీఎం ఛాంబర్కు వెళ్లారు. అక్కడ జగన్మోహన రెడ్డి తో కాసేపు భేటీ అయ్యారు. భేటీ అనంతరం సీఎం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వరప్రసాద్.. తాను మర్యదాపూర్వకంగానే సీఎం జగన్ను కలిశానని మీడియాకు చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన పార్టీ తరపున వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన అధికార పార్టీ వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగాలు వచ్చాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని ఇటీవల వరప్రసాద్ స్పష్టం చేశారు.