జర్నలిస్టులకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వరాలు కురిపించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తెలంగాణ తరహాలో డబుల్ బెడ్ రూం ఇళ్లని నిర్మించి ఇవ్వాలని ఏ పాఠశాలలో చదివించినా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని,స్కూల్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50 వేలు ... కాలేజ్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70 వేలు చెల్లించాలని,.రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబాలకు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం...వర్కింగ్ జర్నలిస్టులకు మండల స్థాయి జర్నలిస్టులకు 5 వేలు గౌరవ వేతనం నియోజకవర్గం,రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు 10 వేలు గౌరవ వేతనం,పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15 వేల పెన్షన్ చిన్న పత్రికలకు జీవం పోసేలా భారీగా ప్రబుత్వ ప్రకటనలు ఇవ్వాలి అని ,జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నూతన పథకానని తీసుకరనున్నట్లు,20 లక్షల వరకూ వైద్య సహాయం ఉచితంగా అందించేలా రాజన్న జర్నలిస్ట్ హెల్త్ స్కీం వర్తింప జేయాలని,.అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చెయ్యాలని,సచివాలయం లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు ఉచిత భోజన సదుపాయం కల్పించడానికి నిర్ణయించినట్లు వార్త వైరల్ అవుతుంది.