కొత్తప్రభుత్వం కొలువుదీరి అధికారుల ప్రక్షాళన జరిగాక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) బాధ్యులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కీలకమైన జీఏడీ, హోం, శాంతిభద్రతలు, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ శాఖలను సీఎం ముఖ్య సలహాదారుడు అజేయ కల్లంకు అప్పగించారు. సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ కు పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికవసతులు, పెట్టుబడులు, విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, ఐటీ, ఇంధన శాఖలను కేటాయించారు. రవాణా, రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ, గృహనిర్మాణం, ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, సంక్షేమ శాఖలు, క్రీడల శాఖలను సీఎం కార్యదర్శి సొల్మన్ ఆరోక్యరాజ్ కు కేటాయించారు.సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి కి వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం, నీటి వనరులు, పర్యావరణం, అటవీ, సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, సీఆర్‌డీఏ బాధ్యతలు కేటాయించారు. పశుసంవర్థక, మత్స్యశాఖ, సహకారం, సాంస్కృతిక బాధ్యతలు సీఎం మరో అదనపు కార్యదర్శి జే.మురళి చూడనున్నారు. సీఎం ప్రత్యేక అధికారి ముక్తాపురం హరికృష్ణకు ఆరోగ్య శ్రీ, సీఎంఆర్‌ఎఫ్, విజ్ఞాపనలను కేటాయించారు.
ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి సీఎం అపాయింట్‌మెంట్స్ బాధ్యతలను చూస్తారు.