YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బెంగాల్ లో బీజేపీ ర్యాలీ హింసాత్మకం

 బెంగాల్ లో బీజేపీ ర్యాలీ హింసాత్మకం

పశ్చిమ బెంగాల్‌లో నేడు బీజేపీ చేపట్టిన ర్యాలీపై పోలీసులు లాఠీచార్జ్‌ ప్రయోగించారు. బష్రహత్‌ ప్రాంతంలో శనివారం నాడు జరిగిన ఇద్దరు బీజేపీ కార్యకర్తల హత్యకు నిరసనగా ఆ పార్టీ నేడు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. కోల్‌కతాలోని లాల్‌బజార్‌ వరకు నిరసన ర్యాలీ తలపెట్టింది. రాష్ట్ర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ అదే ప్రాంతంలో కొలువై ఉన్నాయి. అధికార తృణముల్‌ ప్రభుత్వానికి అదేవిధంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చర్యలు తీసుకోని పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నేడు నిరసన కార్యక్రమం చేపట్టింది. వందలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను హోరెత్తించారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వైపు దూసుకువస్తున్న ర్యాలీని పోలీసులు నిలువరించారు. ఎంతకి వెనక్కి తగ్గకపోయేసరికి పోలీసులు బ్యాటెన్స్‌, టీయర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనాన్లను ప్రయోగించారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు బాటిళ్లు, రాళ్లను పోలీసులపై విసిరారు. నూతనంగా ఎన్నికైన 18 మంది బీజేపీ ఎంపీలు, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌, పార్టీ సీనియర్‌ నాయకులు కైలాష్‌ విజయవార్గేయ, ముకుల్‌ రాయ్‌ ర్యాలీలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణముల్‌ల మధ్య రోజురోజుకు వివాదాలు ముదురుతున్న విషయం తెలిసిందే. మతకలహాలు సృష్టించి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. చనిపోయిన పులికంటే దెబ్బతిన్న బెబ్బులే చాలా ప్రమాదకరమని మమతా బెనర్జీ అన్నారు. శత్రువుల చర్యలను తిప్పికొట్టనున్నట్లు వాగ్ధానం చేశారు.

Related Posts