YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ ట్రాప్ లో బాబు పడినట్టేనా

 జగన్ ట్రాప్ లో బాబు పడినట్టేనా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఈ మాటలు అన్నది ఎవరో కాదు దేశాన్ని ఏలే ప్రధానమంత్రి. అదీ పార్లమెంట్ నిండు సభలో అన్ని పార్టీల సాక్షిగా దేశమంతా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తుండగా నరెంద్రమోదీ బాబు మీద పంచ్ డైలాగులే విసిరారు. టీడీపీ అవిశ్వాసానికి మోడీ సమాధానం చెబుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతగానో బాధపడారు. మధనపడ్డారు. నా రాజకీయ అనుభవంలో సగం కూడా లేని జగన్ తో పోల్చడమా, పైగా జగన్ ట్రాప్ లో నేను పడ్డానని మోడీ చెప్పడమా అంటూ మయసభలో దుర్యోధనుని మాదిరిగా అవమానభారంతో కన్నెర్రచేశారు కూడా. అయితే జరిగింది మాత్రం అదే. ఇపుడు టీడీపీకి అనుకూలమని ప్రచారంలో ఉన్న మీడియా కూడా ఇదే మాట అంటోంది. అంతెందుకు అంతర్గత సంభాషణల్లో తమ్ముళ్ళు కూడా అదే వాపోతున్నారు.ఏపీకి కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చిందని, వాటిని దాచేసి చంద్రబాబు అబద్దాలు ఆడుతూ బీజేపీని, మోదీని జనంలో చెడ్డ చేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తాజాగా అంటున్నారు. బీజేపీతో బధం తెంచుకోవద్దు అంటూ తమ నాయ‌కుడు మోడీ చెప్పినా కూడా బాబు పెడచెవిన పెట్టారని, అదే చివరకు టీడీపీ కొంప ముంచిందని ఆయన విశ్లేషిస్తున్నారు. దీన్నే ఇపుడు అనుకూల మీడియా కూడా హైలెట్ చేస్తోంది. కేంద్రంతో, మోదీతో సరైన సంబంధాలు చంద్రబాబు కొనసాగించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండదని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. బాబు అపర చాణక్యం సంగతేమో కానీ ఒకేసారి అందరితోనూ తగవులు తెచ్చుకుని ఎటూ కాకుండా పోయారని ఆ పార్టీ సానుభూతిపరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక చంద్రబాబు మొదట ప్రత్యేక హోదా అన్నా కూడా తరువాత మోడీ వ్యవహారం చూసి ప్యాకేజికి ఓకే చెప్పేశారు. దాని మీద ఏపీలో విపక్షం వైసీపీ ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా కూడా కట్టుబడి ఉంటే బాబుకు, ఏపీకి కూడా మేలు జరిగేదని, రాజకీయంగా కూడా దెబ్బ తగిలేది కాదని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ప్రత్యేక హోదా ఉచ్చులో బాబు బాగా ఇరుక్కున్నారని, ఏపీకి హోదా రాదు అన్నది వైసీపీతో సహా అందరికీ తెలిసిందేనని, కానీ కావాలని బాబుని ఎగదోస్తే ఆయన ఇరుక్కుపోయారని అంటున్నారు. ఫలితంగా హోదా విషయంలో ఎన్నో యూ టర్నులు తీసుకున్న అపనింద బాబు మీద పడి ఆయన పార్టీకి ఏపీ జనం గోరీ కట్టేశారు, అదే సమయంలో హోదా పోరాట వీరునిగా జగన్ కి పేరు వచ్చి అదే జనంలో మడమ తిప్పని నేతను చేసి చివరకి ఏపీకి సీఎం ని చేసిందని అంటున్నారు. బాబుని తెలివిగా హోదా చిక్కుల్లొకి నెట్టిన వైసీపీ ఇపుడు తెలివైన రాజకీయ ఎత్తుగడలను అనుసరిస్తోందని అంటున్నారు. మొత్తానికి నలభయ్యేళ్ళ అనుభవం అంటూ వచ్చిన బాబు జగన్ చేతిలో చిత్తు కావడం విషాదమేనని తమ్ముళ్లు అంగీకరిస్తున్నారు

Related Posts