యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కావేటి విజయానంద్ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీఐ స్పష్టం చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఏపీ జెన్కో సీఎండీ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సబ్ కలెక్టర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.