ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వైరెస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు గురువారం పాలాభిషేకం చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కు జీతాలు పెంచుతామని హామినిచ్చారు. ఆ హామీ ని అమలు చేస్తు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వేతనం 12 వేల నుంచి 18 వేలకు వేతనం పెంచారు. ఈ శుభ సందర్భంగా పారిశుధ్య కార్మికులు వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ రాజ శేఖర్ రెడ్డి విగ్రహంకు పాలాభిషేకం చేసారు. పులా దండ వేసి తమ ఆనందం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బ్రహాం, నాగయ్య ,మురళి,, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.