YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సబ్బం రాజకీయాలకు రాం..రాం...

సబ్బం రాజకీయాలకు రాం..రాం...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

స‌బ్బం హ‌రి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ‌యాంలో అనాక‌ప‌ల్లి ఎంపీగా వ్యవ‌హ‌రించిన కాంగ్రెస్ నాయ‌కుడు. రాష్ట్ర విభ‌జ‌న‌తో తెర‌మీదికి వ‌చ్చిన ఆయ‌న విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా గ‌ళం వినిపించాడు. విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా ఆయ‌న త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అయిన‌ప్పటికీ.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏ పార్టీలోనూ చేర‌కుండా, ఆ ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేయ‌కుండా రాజ‌కీయంగా విశ్లేష‌ణ‌ల‌కు మాత్రమే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే ఆయ‌న వైసీపీ వైపు దృష్టి సారించారు. ఆ పార్టీలోకి వెళ్లారు. కీలకపాత్ర పోషించాలనుకున్నారు. అది వీలుకాకపోవడంతో తిరిగి వచ్చారు.విశాఖ మేయ‌ర్‌గా ప‌నిచేసిన స‌బ్బంకు వైఎస్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ 2009లో అన‌కాప‌ల్లి ఎంపీ సీటు ఇవ్వగా ఆయ‌న విజ‌యం సాధించారు. వైఎస్ మ‌ర‌ణాంత‌రం స‌బ్బం కొద్ది రోజుల పాటు జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గానే నిలిచారు. ఇక ఈ ఎన్నిక‌ల‌కు రెండు నెలల ముందు నుంచి ఒక్కసారిగా యూట‌ర్న్ తీసుకుని చంద్రబాబుకు అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తూ వ‌చ్చారు. ఈ క్రమంలోనే ఆయ‌న వైసీపీపై విమ‌ర్శలు చేస్తూ వచ్చారు. ఇక‌, అదే స‌మయంలో టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును వీలున్నప్పుడ‌ల్లా కూడా స‌పోర్టు చేస్తూ వ‌చ్చారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతంలో రాజ‌ధాని నిర్మాణాల‌పై వ‌చ్చిన విమ‌ర్శల‌కు తానే స్వయంగా క‌లుగ జేసుకుని.. మ‌నం సొంత ఇంటిని క‌ట్టుకోవాలంటేనే ఏళ్లకు ఏళ్లు ప‌డుతుంద‌ని, అలాంటిది ప్రపంచ స్థాయి న‌గ‌రం క‌ట్టాల‌ని అనుకున్న‌ప్పుడు ఆ మాత్రం లేట‌వ‌దా? అంటూ ప్రశ్నలు గుప్పించారు.తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకుండానే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ వ‌చ్చారు. ఇక‌, ఎన్నిక‌ల‌పై కూడా ఆయ‌న విశ్లేష‌ణ‌లు చేసేశారు. ఇక‌, 2014లో ప‌ట్టిన పంతాన్ని ప‌క్కకు పెట్టిన స‌బ్బం.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విశాఖ జిల్లాలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున అనూహ్యంగా బ‌రిలోకి దిగారు. స‌బ్బం ఇస్తున్న స‌పోర్టును గుర్తు పెట్టుకున్న చంద్రబాబు.. భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావును త‌ప్పించి మ‌రీ.. స‌బ్బంకు సీటు ఇచ్చారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేక‌త కావొచ్చు.. లేదా వ్యక్తిగ‌తంగా స‌త్తా చూప‌లేని కార‌ణం కావొచ్చు.. ఏదైతేనేం.. స‌బ్బం హ‌రి ఓట‌మిపాల‌య్యారు. టీడీపీలోకి ఇలా వ‌చ్చి అలా ఓడిపోయిన నేతల జాబితాలో ఆయ‌న నిలిచిపోయారు. ఇక‌, ఇప్పుడు స‌బ్బం ప‌రిస్థితి ఏంటి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారింది. టీడీపీ త‌ర‌పున చివ‌రి నిముషంలో టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు కాబ‌ట్టి.. రుణం తీర్చుకునేందుకు పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తారా? లేక‌.. ఇక‌, రాజ‌కీయాల‌కు రాం..రాం!! అని త‌ప్పుకొంటారా? అనేది వేచి చూడాల్సిందే.

Related Posts