యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష-2019 ఫలితాలను 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)' విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో మొత్తం 3,884 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. కటాఫ్ మార్కుల వివరాలను కూడా అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్ష ఫలితాలు, కటాఫ్ మార్కుల వివరాల ఫలితాల్లో ఢిల్లీకి చెందిన భావిక్ బన్సాల్ 100 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. బన్సాల్ నీట్-2019 ఫలితాల్లో రెండో ర్యాంకు నిలవడం విశేషం. మొత్తం నలుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. బన్సాల్ తర్వాత వడోదరాకు చెందిన విశ్వ హితేంద్ర రెండో స్థానంలో నిలిచాడు. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు మే 25, 25 తేదీల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.