YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సభలో బంట్రోతు వివాదం

సభలో బంట్రోతు వివాదం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. స్పీకర్ చైర్ వరకు ప్రతిపక్షనేత చంద్రబాబు రాకుండా బంట్రోతును పంపారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో సభలో అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా చెవిరెడ్డి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. బంట్రోతుల్లా.. అనే పదం వాడారని శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు.
నన్ను పిలవలేదు.. రికార్డులు చూడండి!
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షనేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై మాకు ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. తనను పిలవకుండానే స్పీకర్ చైర్ స్థానం వరకు ఎలా వస్తాను? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. "నన్ను పిలవలేదు.. రికార్డులు చూడండి. స్పీకర్కు అభినందనలు తెలిపేందుకు అచ్చెన్నాయుడును పంపిస్తే బంట్రోతు అంటూ అహంభావంతో మాట్లాడుతున్నారు. అహంభావంతో వ్యాఖ్యలు చేసినవారు క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు

Related Posts