యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 3వేల కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాబార్డు నుంచి ఈ మేరకు నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక
శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. అంతేకాదు, ఎప్పటికప్పుడు యూసీలను పంపిస్తే.. ప్రాజెక్టుకు ఖర్చు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తామని ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. మరోవైపు, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాత్ దాస్ ను ముఖ్యమంత్రి జగన్ నిన్న ఢిల్లీకి పంపారు. పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేతకు సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల సడలింపు జూలై 2 తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, ఉత్తర్వులను సడలించడం కాకుండా.. పూర్తిగా ఎత్తి వేసేలా సంబంధిత శాఖల అధికారులతో చర్చించాలని జగన్ సూచించారు.