YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్పీకర్ కు సహకరిస్తాం

స్పీకర్ కు సహకరిస్తాం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ప్రతిపక్షంలో పనిచేయడం మాకు కొత్త కాదని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం  స్పీకర్ ఎన్నిక అనంతరం శాసన సభలో మాట్లాడిన చంద్రబాబు   ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ‘నా వాయిస్ ఏమీ తగ్గదు. నేను ఇవాళ వివాదాలకు పోదల్చుకోలేదని అయన అన్నారు. స్పీకర్ గా ఎన్నికయిన  తమ్మినేని సీతారాంకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. తమ్మినేని సీతారాంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని ప్రతిపక్షనేత  అన్నారు. అనేక పదవులను తమ్మినేని అలంకరించారు. స్పీకర్ స్థానంలో కూర్చొన్న తమ్మినేనికి అన్ని విధాలా సహకరిస్తామని  చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న సందర్భంలో మైక్ సరిగ్గా పనిచేయలేదు. మాట సరిగా రావడం లేదంటూ అధికార పక్ష సభ్యుల ఎద్దేవా చేశారు. ఇందుకు బదులుగా చంద్రబాబు  " నా వాయిస్ తగ్గలేదు.. గట్టిగా మాట్లాడగలను. మా హయాంలో బాగా పని చేసిన మైకులు.. వైసీపీ రాగానే సరిగా పని చేయడం లేదని అన్నారు. ప్రతిపక్షం మాకేం కొత్త కాదు. మా బాధ్యతలను మేం నిర్వర్తిస్తామన్నారు.

Related Posts