యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ రంగ టెల్కోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఎప్పకప్పుడు కొత్త ప్లాన్లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. కంపెనీ తాజాగా మరో కొత్త రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఇది ప్రిపెయిడ్ ప్లాన్. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ పేరు అభినందన్ 151. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్ సదుపాయం ఉంది. రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ ప్రయోజనాలు అన్నీ కేవలం 24 రోజులు మాత్రమే పొందగలం. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు. ప్లాన్ ధర రూ.151. ఈ రూ.151 ప్లాన్ కేవలం 90 రోజులు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉండనుంది. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ ఈ ప్లాన్ లాంచ్ చేసింది