YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతిపక్షం లేకుండా చేయగలం : జగన్

ప్రతిపక్షం లేకుండా చేయగలం : జగన్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఫిరాయింపులపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు-సభ నాయకుడు జగన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. చంద్రబాబు అడుగడునా ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా అధికారపక్షం వ్యవహరించిందని.. ప్రజల తీర్పుతోనే ఇరువురికి ఈ స్థానాలు వచ్చాయన్నారు. చరిత్రను మర్చిపోకూడదన్నారు చంద్రబాబు. ‘వైఎస్‌ జగన్‌ది రాజకీయ కుటుంబం.. ఆయన తండ్రి ముఖ్యమంత్రి.. వైఎస్ రెడ్డి కాంగ్రెస్‌లో గెలిచి.. నాలుగు రోజుల్లో పార్టీ మారిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మీ తండ్రి చేసిన తప్పుని ఒప్పుకోండి.. మీరు అంటున్నారుగా తండ్రికి తగ్గ కొడుకు అంటున్నారుగా.. చరిత్రను ఎవరూ మార్చలేరు కదా’అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఏ స్థాయిలో విలువలు పాటించానో ప్రజలు చూశారన్నారు. టీడీపీ ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడిచింది.. సంతలో పశువుల్ని కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. ఆ ఎమ్మెల్యేల్ని కాపాడుతూ స్పీకర్ పదవికి కళంకం తెచ్చారన్నారు. చేసిన తప్పును మళ్లీ సమర్థించుకున్నారని.. చంద్రబాబులా ఆలోచించి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదాలో కూడా ఉండేవారు కాదన్నారు. తాను ప్రలోభాలు పెట్టి ఉంటే.. మంత్రి పదవులు ఇస్తానంటే.. టీడీపీ నుంచి తనతో ఎంతమంది టచ్‌లో ఉన్నారో చెబితే.. తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. ఈ అన్యాయమైన సంప్రదాయానికి కొనసాగకూడదని.. చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని.. ఎమ్మెల్యేలు కొనసాగాలన్నారు. చంద్రబాబును ప్రతిపక్షం స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం.. పాత పరిస్థితి మారాలని.. కొత్త సంప్రదాయం రావాలని.. మంచి చెప్పే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కానీ చంద్రబాబు గారు దీనిని కూడా వక్రీకరిస్తున్నారు.. అన్యాయంగా మాట్లాడుతున్నారన్నారు జగన్. చంద్రబాబు చేసిన పని తాము చేయమని.. కుక్కతోక వంకర అన్నట్లు ప్రవర్తించడం దారుణమన్నారు. అలాగే హత్యలు చేసినవాడిని హత్య చేయడం తప్పుకాదన్నట్టుగా ప్రతిపక్ష నేత తీరు ఉందన్నారు. గతంలో విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబు.. తప్పును ఒప్పుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలు వింటే ఆశ్చర్యంగా ఉందన్నారు. అవకాశం ఇస్తే చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ చెప్పిన మాటలను సభలో వినిపిస్తానన్నారు

Related Posts