రాష్ట్రంలో వచ్చే సెప్టెంబరు 1వతేదీ నుండి తెల్లరేషన్ కార్డు గల ప్రతి కుటుంబానికి 5కిలోలు,10కిలోలు,15కిలోలతో కూడిన రేషన్ బియ్యం,ఆరు లేదా ఏడు రకాల వివిధ నిత్యావసర సరుకులతో
కూడిన బ్యాగులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) వెల్లడించారు.గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో నూతన చాంబరులో ప్రవేశించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పేదలు,రైతుల సంక్షేమానికి ఈప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని దానిలో భాగంగానే సెప్టెంబరు 1 నుండి గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని పునర్దుధ్ఘాటించారు.అదే విధంగా రైతులు పంట వేయకముందే వారు పండించనున్న పంటకు కనీస మద్ధత్తు ధరను ముందుగానే ప్రకటించి ప్రతి రైతుకు మద్ధత్తు ధరను అందించేందుకు వీలుగా బడ్జెట్లో 3వేల కోట్ల రూ.లతో మార్కెట్ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాట్లు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని),పౌరసరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్,పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్య కుమారి,నూజివీడు శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప అప్పారావు,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.