YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మర్యాద కాపాడుకుంటే మంచింది

మర్యాద కాపాడుకుంటే మంచింది

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ లు చంద్రబాబు పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరి కాదు. ఎన్నికల సమయంలో నోటికొచ్చినట్లు మాట్లాడారు, అసత్యాలను ప్రచారం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా విమర్శలు చేయడం సమంజసమా అని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముందు చూపుతో బస్సులో ఉంటూ ఎపి లో పాలన ప్రారంభించారు. అమరావతి లో మంత్రులు, శాసన సభ్యులు , అధికారుల కోసం అధునిక వసతులతో ఛాంబర్ లు కట్టించారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన మీరు చంద్రబాబు కట్టించిన భవనాల నుంచే పాలన సాగిస్తున్నారని అయన అన్నారు. చంద్రబాబు ప్రతి పక్ష నేతగా ఉన్నారు, వయసు కైనా గౌరవం ఇస్తే బాగుంటుంది. గజనీ, మైండ్ పోయింది అంటూ చంద్రబాబు పై వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజలు మీకు అధికారాన్ని అప్పచెప్పారు..కొంత సమయం ఇవ్వాలనే మేం కూడా వేచి చూస్తున్నాం. అయినా.. చంద్రబాబు పై చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. ఇతర పార్టీ ఎమ్మెల్యే లు వైసిపి లోకి వస్తే రాజీనామా చేసి రావాలని జగన్ చెప్పడాన్ని నేను స్వాగతిస్తున్నాని అన్నారు. పోలవరం గురించి కనీసం సమీక్ష
చేయకుండా టిడిపి ప్రభుత్వం పని తీరును ఎలా తప్పుబడతారు. టిడిపి ప్రవేశ పెట్టిన పధకాలను తొలగించినా మేం మాట్లాడలేదు. మీ పని తీరు చూసేందుకు కొంత సమయం వేచి ఉండాలని భావిస్తున్నాం. మీరు అనవసరంగా నోరు పారేసుకుంటే... మేము కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతాం. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది గుర్తు ఉంచుకుంటే మంచిది. స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతిపక్ష సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం సంప్రదాయమని అన్నారు. సంఖ్యా బలం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించి , చంద్రబాబు ను తప్పు బడితే ఎలా.జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మర్యాద కోసమైనా ప్రతి పక్ష నేత వద్దకు వెళ్లారా.. రాజకీయాలలో గెలుపోటములు సహజం,.. కానీ ఎవరి మర్యాదను వారు కాపాడుకుంటే మంచిది. ఇప్పటికైనా చంద్రబాబు ఐ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని వైసిపి సభ్యులను కోరుతున్నామని అన్నారు.

Related Posts