యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
అందాలతార పూజా హెగ్డే ఓ పాట పాడడానికి రెడీ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఓ పాటను ఈ ముద్దుగుమ్మ చేత పాడించడానికి సంగీత దర్శకుడు తమన్ ఆమెను ఒప్పించాడట. త్వరలో దీనిని రికార్డు చేయనున్నట్టు సమాచారం.