కేసీఆర్ మైండ్ గేమ్ లో జగన్ ఇరుక్కుంటున్నారా.... అంటే ఔననే సమాధానమే వస్తోంది.ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని… తెలంగాణ సీఎం కేసీఆర్.. అత్యుంత వ్యూహాత్మకంగా.. కేవలం బాడీ లాంగ్వేజ్ ద్వారా ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో బలంగా ఏర్పడుతోంది. ఎన్నికలకు ముందు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ సహకరించింది. ఆ కృతజ్ఞతకు తోడు.. కేసీఆర్ ఎప్పుడూ లేనంత గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు. దాంతో జగన్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కేసీఆర్ ఏం అడిగినా.. తలూపుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆస్తుల విషయంలోనూ.. కేసీఆర్ జగన్‌ను మొహమాట పెడుతున్నారు. ఫలితంగా.. వివాదాల పరిష్కారం పేరుతో… తెలంగాణ… అన్ని ప్రయోజనాలను పొందుతోందనే ప్రచారం ప్రజల్లోకి వెళ్తోంది. భవనాలు తీసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. రంజాన్ వచ్చింది. ఆ రంజాన్ విందు కోసం జగన్ .. రాజ్ భవన్ వెళ్లారు. అక్కడ ఏం మంతనాలు జరిగాయో ఎవరికీ తెలియదు. వెంటనే గవర్నర్.. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ భవనాలు మొత్తాన్ని.. తెలంగాణకు అప్పగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. కనీసం పరిహారం అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. రూ. 30వేల కోట్ల ఆస్తులు ఇచ్చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గెలిచిన కొత్త కాబట్టి.. బాగానే ఉంటుంది. తర్వాత ఈ విషయం ఇష్యూ అయితే ఇబ్బంది పడేది జగనే. భవనాలు ఇచ్చేసినందుకు.. ప్రతిఫలంగా ఏపీకి ఏం దక్కిందో కూడా.. ప్రజలు చూస్తారు. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. అన్నీ భవనాలు తీసుకుని రెండు భవనాలు మాత్రం ఇస్తున్నారు. ఇవి చట్ట ప్రకారం కేటాయించిన భవనాల్లో లేవు. అన్నీ ఇచ్చేసి కొత్తవి తీసుకుంటున్నారు కాబట్టి.. ఇవి అద్దెకు తీసుకున్న ఖాతాలోకి వస్తాయంటున్నారు. కాళేశ్వరానికీ గోదావరిలో వేల టీఎంసీలు సముద్రంలో కలసిపోతున్నాయి. మేం 750 టీఎంసీలు మాత్రమే వాడుకుంటాం. మిగాతవి మొత్తం మీరు వాడుకోండి.. అని.. కేసీఆర్.. ఏపీ సీఎంకు చెప్పారు. దానికి ఏపీ సీఎం స్పందనేమిటో తెలియదు కానీ.. తెలంగాణ నిజంగా 750 టీఎంసీలు వాడుకోవడానికి.,. ప్రాజెక్టులు కడితే.. దిగువనున్న ఏపీకి.. చుక్క నీరు రాదనేది జలవనరుల నిపుణుల విశ్లేషణ. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల గోదావరి నీరు దిగువకురావడం తగ్గిపోతుందని.. అది ఏపీ కేటాయింపులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. అసలు
ఆ ప్రాజెక్ట్ అక్రమమని ఏపీ వాదిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ తో సాన్నిహిత్యం కారణంగా ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ వెళ్తున్నారు. అంటే.. ఆ ప్రాజెక్ట్‌కు ఆమోద ముద్ర వేసినట్లే. మరి ఏపీకి జరిగే
నష్టానికి కేసీఆర్ నుంచి జగన్ ఏపీ, తెలంగాణ మధ్య చాలా పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణకు ప్రయోజనకకరమైన వాటిని కేసీఆర్… జగన్ తో సత్సంబంధాల కారణంగా.. ఆయన పరిష్కరించుకుంటున్నారు. అదే సత్సంబంధాలతో.. జగన్ ఎందుకు.. పరిష్కారానికి ప్రయత్నించడం లేదనే చర్చ ప్రారంభమయింది. తెలంగాణ విద్యుత్ బకాయిలు.. రూ. ఆరేడు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. వంకలు పెట్టడంతో.. ఏపీ సర్కార్ ఎన్సీఎల్టీలో తెలంగాణ విద్యుత్ సంస్థలపై కేసులు వేసింది. ఆసంగతి ఇంత వరకూ మాట్లాడలేదు. ఇక షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఇప్పటికీ లెక్క తేలలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. జనాభా ప్రాతిపదికన ఈ సంస్థల ఆస్తులు పంచుకోవాల్సి ఉంది. కనీసం.. రూ. అరవై వేల కోట్ల ఆస్తులు వస్తాయన్న అంచనా ఉంది. వీటి సంగతి జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పై.. తెలంగాణ సర్కార్ ఎన్నో అభ్యంతరాలు చెబుతూ… కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. వాటి సంగతి ఏ శిఖరాగ్ర సమావేశంలోనూ జగన్ ప్రస్తావించలేదు. ఇవి పెద్ద పెద్దవి మాత్రమే.. ఉద్యోగుల విభజన సహా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు..! సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడం… స్నేహపూర్వక వాతావరణం ఉండటాన్ని అందరూ కోరుకుంటారు కానీ.. ఆ పేరుతో.. స్వరాష్ట్ర ప్రయోజనాలను కూడా.. లైట్ తీసుకోవడం.. కరెక్ట్ కాదు. ఇది ప్రజల్లోకి వెళ్తే.. సొంత రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఆసక్తి చూపని సీఎంగా.. జగన్ చరిత్రలో నిలిచిపోతారు. అది ఆయన పొలిటికల్ కెరీర్‌కు మచ్చ అవుతుంది