YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

పాలమూరు వర్శిటీలో అమ్మాయిలదే హవా..

Highlights

  • పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
పాలమూరు వర్శిటీలో అమ్మాయిలదే హవా..

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో అమ్మాయిలే అధిక శాతం ఉత్తీర్ణతను సాధిస్తూ ముందంజలో నిలుస్తున్నారు. ఈ వర్శిటీ  నిర్వహించిన డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణ శాతం అమ్మాయిలదే అధికం. అన్ని విభాగాల్లో వాళ్ళే పై చేయిగా ఉన్నారు. డిగ్రీ మొదటి, మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదలైయ్యాయి.డిగ్రీ మూడవ సెమిస్టర్లో మొత్తం 11,560 విద్యార్థులు హాజరుకాగా అందులో 3,859 విద్యార్థులు (33.38) శాతం ఉత్తీర్ణులు 7,682 (66.45)శాతం విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. 19.016 విద్యార్థులు మాల్ప్రక్టీస్లో బుక్ అయ్యారు. డిగ్రీ మొదటి సెమిస్టర్లో 12,864 విద్యార్థులు హాజరుకాగా 3,576 (27.80)శాతం ఉత్తీర్ణులయ్యరు. 0,268 (72.05) విద్యార్థులు ప్రమోట్ కాగా, 20(0.16) శాతం విద్యార్థులు మాల్ప్రాక్టీస్లో బుక్ అయ్యారు. మొత్తం బీఏ కోర్సులో 26.63 శాతం, బీకాంలో 26.26 శాతం, బీఎస్సీలో 39.15 శా తం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరి లో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉందని  పీయూ వీసీ బీ రాజారత్నం, రిజిస్ట్రార్ ఐ పాండురంగారెడ్డిలు వెల్లడించారు.మొదటి సెమిస్టర్లో బీఏలో 25.89 శాతం, బీకాంలో 26.95 శాతం, బీఎస్సీలో 29.07 శాతం ఉత్తీర్ణులయ్యారని, వీరి లో అమ్మాయిలు 36,48 ఉత్తీర్ణులయ్యానని పీయూ పరీక్షల విభాగంగా ఇన్చార్జి ప్రొఫెసర్ గిరిజ తెలిపారు. మొదటి, మూడవ సెమిస్టర్లో మళ్లీ దరఖాస్తులు చేసుకోనేవారు ఈ నెల 13లోగా దరఖా స్తు చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగభూషణం, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రొఫెస ర్లు పవన్ కుమార్, మనోజ, డా. జైపాల్ రెడ్డి, కిశోర్, రాజు కుమార్, చంద్రకిరణ్, కుమారస్వామిలు పాల్గొన్నారు.

Related Posts