YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా చదువుల పండుగ .అందరికి విద్య మనందరి బాధ్యత

ఘనంగా చదువుల పండుగ .అందరికి విద్య మనందరి బాధ్యత

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కొల్లాపూర్ లో ప్రో.జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం ఘనంగా జరిగింది.  స్థానిక వరిదేల ప్రాథమికొన్నత పాఠశాలలో చదువుల పండుగ కార్యక్రమం జరిగింది.  ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి   పాల్గొన్నారు.  చదువుల తల్లి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.  విద్యార్థులతో  ఎమ్మెల్యే అక్షరాభ్యాసం  చేయించారు. విద్యార్థులు కోలాటాలు వేసి అలరించారు.  విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ....ప్రో.జయశంకర్ సార్ బడిబాటలో భాగంగా చదువు పండుగలో ప్రతి ఉపాధ్యాయులు పాల్గొని పిల్లలను బడికి  తీసుకురావాలని అయన పిలుపునిచ్చారు.  14వ తేది నుండి 19వ తేది వరకు జరిగే బడిబాట కార్యక్రమములో యూత్, యువకులు, మహిళ సంఘాలు, స్వచంద సేవా సంస్థలు పాల్గొని బడిబయట ఉన్న పిల్లలను బడికి తీసుకొచ్చి బడిలో చేర్పించాలి.  ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మీరు చదువు నేర్పి చూయించాలి.  ప్రభుత్య పాఠశాలలో కూడా నాణ్యతమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలి.   ప్రతి ఇంట్లో మగ, ఆడ తేడా లేకుండా పిల్లలను బడికి తీసుకురావాలి, చదువు నేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరకు ఎమ్మెల్యే ఫండ్స్, మరి కొందరి దాతల సహకారం తీసుకొని
అభివృద్ధి చేద్దాం.  మీ సహకారం అవసరం ఉండాలని వారు అన్నారు.  గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బడిబాట కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు.  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు  విద్యార్థులకు వారి సొంత ఖర్చులతో స్పోర్ట్స్ పరికరాలు అందజేస్తనని అయన తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఏంఈఓ చంద్రశేఖర్ రెడ్డి,పాఠశాల ల  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Posts