యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు సోమవారం నాడు విధులను బహిష్కరించనున్నారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. కోల్‌కతాలో జూనియర్ వైద్యులపై దాడులకు నిరసనగా తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ సమ్మెకు పిలుపునిచ్చింది. ఢిల్లీ, ముంబయితో ఇతర నగరాల్లో వైద్యులు నేడు విధులను బహిష్కరించారు. వీరి నిరసనతో వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయంలో సీఎం మమతా బెనర్జీ పంతానికి పోవొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల రక్షణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.