గత ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనలో అగ్రస్థానంలో నిలిచిందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అన్నారు. పాత సరళీకృత పెట్టుబడి విధానాన్ని కొనసాగించాలి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు. శుక్రవారం అయన తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాలకు అనుగుణంగానే ఎపిని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాల్లోను, పరిశ్రమల స్థాపనకు ఎపికి అధికప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఆంధ్రుడికి చేరేందుకు వైసిపి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అయన అన్నారు.