YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూడు వారాల్లోనే మా కార్యకర్తలపై వందకు పైగా దాడులు దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

మూడు వారాల్లోనే మా కార్యకర్తలపై వందకు పైగా దాడులు   దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీలో
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై, భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ కార్యకర్తలపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మూడు వారాల్లోనే తమ కార్యకర్తలపై వందకుపైగా దాడులు జరిగాయని అన్నారు. టీడీపీ కార్యకర్తల ఆస్తులు, శిలాఫలకాలపై దాడులు జరిగాయని, ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టడం, తమ కార్యాలయానికి నిప్పుపెట్టడం వంటి దారుణాలకు వైసీపీ మూకలు పాల్పడ్డాయని అన్నారు.గ్రామస్థాయిలోని టీడీపీ కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు గెలిచినా ఈ రకంగా ఎప్పుడూ దాడులు చేయలేదని, దాడులను నివారించడం, దౌర్జన్యాలను ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యమని,నమ్ముకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. వైసీపీ దాడుల్లో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ బాసటగా నిలుస్తుందని భరోసా కల్పించారు. వైసీపీ మూకలు చేసిన దాడుల్లో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ప్రకటించారు.  

Related Posts