YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పక్క చూపులు చూస్తున్న సైకిల్, హస్తం నేతలు

పక్క చూపులు చూస్తున్న సైకిల్, హస్తం నేతలు

తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయో లేదో కారు, కమలం జోరు మీద ఉండగా హస్తం, సైకిళ్ళు వారి దెబ్బకు బేజారు అయిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన శాసన సభ్యుల్లో 12 మందిని గులాబీ పార్టీ కలిపేసుకుని సీఎల్పీ లేకుండా చేసింది. ఇక ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన కమలం తెలంగాణ లో పార్టీ విస్తరణ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ టిడిపి లలో మిగిలి పోయిన హేమా హేమీలనుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు కమలం కి జై కొట్టేలా ఆపరేషన్ ఆకర్ష్ కి పెద్ద ఎత్తునే తెరతీసింది. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఎలాంటి వారినైనా కమలం కి జై కొట్టేలా చేయగలిగే ఆరెస్సెస్ నేత కేంద్ర బిజెపిలో కీలకమైన రామ్ మాధవ్ తాజాగా తెలంగాణ లో మకాం వేశారు. ఆయన వద్దకు వరుసగా ఇప్పుడు టి టిడిపి నాయకులు, టి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టేస్తున్నారు. వీరిలో ఇటీవలే గెలిచిన కాంగ్రెస్ ఎంపీల నుంచి కొందరు ఎమ్యెల్యేలు కూడా ఉండటం గమనార్హం. కేంద్రంలో యుపిఎ సర్కార్ రాకపోవడం, గులాబీ పార్టీ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం భరించలేని వారినందరిని గుర్తించి పార్టీలో సముచిత స్థానానికి రామ్ మాధవ్ భరోసా కల్పిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో కమల వికాసానికి పటిష్టమైన క్యాడర్ వున్న లీడర్ లను వలవేసి లాగుతున్నారు మాధవ్.ఎన్నికల్లో ఫలితాలొచ్చి నెలరోజులు కూడా కాకుండానే గెలిచిన, ఒడిన వారంతా అధికార పార్టీలవైపు దృష్టి పెట్టేశారు. అవకాశం వున్న వారు ఆఫర్లు అందుకున్న వారు గులాబీ కోటలోకి దూకేస్తే ఇక పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన ఒడిన వారు ఇక కాంగ్రెస్ టిడిపి లతో “లాభం ” లేదని
డిసైడ్ అయిపోయి కేంద్రంలోని బిజెపి సర్కార్ కి జై కొట్టేయాలని అంచనాకు వచ్చేశారు. ఇలా వచ్చిన వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి వంటి వారితో పాటు ఒక రాజ్యసభ సభ్యుడు మరో
ఎమ్యెల్యే కూడా ఉన్నారన్న ప్రచారం సాగుతుంది. వీరంతా రామ్ మాధవ్ తో రహస్య భేటీ సాగించినట్లు పొలిటికల్ లోకం కోడై కూస్తుంది. బీజేపీలోకి బాలానగర్ కార్పొరేటర్ బాలాజీ నగర్ కార్పొరేటర్ పన్నాల కావ్య హరీశ్రెడ్డి దంపతులు బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మన్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు సమక్షంలో వారు పార్టీలో చేరారుకార్పొరేటర్ కావ్య ఆమె భర్త హరీశ్రెడ్డిలకు గతంలో బీజేపీతో అనుబంధం ఉంది. నిజామాబాద్ జిల్లా వేల్పూరుకు చెందిన హరీశ్రెడ్డికి ఏబీవీపీ నేతగా  గుర్తింపు ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్కు సన్నిహితుడిగా మెలిగారు.  కూకట్పల్లిలో స్థిరపడ్డాక కూకట్పల్లి మున్సిపాలిటీలో టీడీపీ నుంచి కౌన్సిలర్గా గెలుపొందారు. కూకట్పల్లి మున్సిపాలిటీ
జీహెచ్ఎంసీలో కలిసిన తర్వాత రెండు సార్లు కార్పొరేటర్గా పోటీచేసి ఓడిపోయారు.  తదుపరి  కాంగ్రెస్లో  ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు.  2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన భార్య కావ్యను బాలాజీనగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిపించుకున్నారు. కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయికి హరీశ్రెడ్డి ఎదగడంతో  ఎమ్మెల్యే  మాధవరం కృష్ణారావుతో రాజకీయ వైరం పెరిగింది.  కూకట్పల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టీఆర్ఎస్ పార్టీ సీటు ఇవ్వడంతో హరీశ్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీచేశారు. కొన్ని నెలల పాటు సైలెన్స్గా ఉన్న హరీశ్రెడ్డి కార్పొరేటర్ అయిన తన భార్య కావ్యతో పాటు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Related Posts