యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అధికార పార్టీ నేతలు చంద్రబాబు పై కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. చంద్రబాబు ను వ్యక్తిగతంగా అవమానించేందుకు కుతంత్రాలు చేశారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు చంద్రబాబు ను అవమానించేలా వ్యవహరించారు. అసేంబ్లీలో స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పింది తక్కువ, చంద్రబాబు ని విమర్శించింది ఎక్కువ. ఎవరి పైనా కక్ష పూరితంగా వ్యవహరించబోమంటూనే .. మాటలు చెబుతూ.. చేతల్లో మాత్రం వారు అనుకున్నది చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే టిడిపి నేతలు, కార్యకర్తల పై హత్యలు, దాడులు చేయిస్తున్నారని అన్నారు. డిల్లీలోనే ఉన్న వైసిపి నేతలు కేంద్రం పెద్దలతో చెప్పించి.. చంద్రబాబు ను ఎయిర్ పోర్ట్ లో అవమానించారు. మేము ఐదేళ్లలో ఎక్కడైనా కక్ష పూరితంగా వ్యవహరించామా అని ప్రశ్నించారు. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీలోనే ఉన్నారనే విజయం అధికారులకు తెలియదా. మొదటి సారి వెళ్లి నపుడు చంద్రబాబు కు తనిఖీ లు చేయలేదని అన్నారు. రెండోసారి వెళితే తనిఖీ లు చేయడం వెనుక వైసిపి కుట్ర ఉంది. రాష్ట్ర ప్రజలు కంటతడి పెట్టుకునేలా చంద్రబాబు ను అవమానించారు. మూడు సార్లు ముఖ్యమంత్రి గా పని చేసిన
వ్యక్తి ని అవమానించడం కరెక్ట్ కాదు. కౌరవ సభలో ధర్మరాజు ను అవమానించినట్లు చంద్రబాబు ను అవమానిస్తే ప్రజల కంటతడికే కొట్టుకుపోతారని అన్నారు. కొత్త గా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే సంప్రదాయాన్ని మేం పాటిస్తున్నామని అన్నారు. జగన్, విజయసాయి రెడ్డి లు అధికారులను ఎంత తిట్టినా మేం ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఇప్పటికైనా చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యలు మానుకుని.. ప్రజలకు పనికొచ్చే విషయాల పై దృష్టి పెడితే మంచిదని సూచించారు.