యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
హత్యా రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబు. బాబు హయాంలో ఎన్ని హత్యలు జరిగాయి,ఎన్నిదోపిడీలు జరిగాయి. చంద్రబాబు వెన్నుపోటు దారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈవిషయం తెలుసు.అందుకే అధికారానికి దూరం చేశారు ప్రజలని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. శనివారం అయన మీడియాతోమాట్లాడారు.
ఏ ఒక్కరిపైన కూడా దాడి జరగటానికి వీల్లేదు,రాజకీయ కక్ష్య లు చేయరాదు అని జగన్ చెప్పారు. చంద్రబాబు హయాం లో నాయకులు చేసిన అరాచకాలకు అన్ని కులాల ,వర్గాల ప్రజలు గట్టిబుద్ది చెప్పారు. టిడిపి హయాం లో వైసీపీ నేతలు కార్యకర్తలను బయటికి రాకుండా కేసులు పెట్టి వేదించారని అన్నారు. ఏపార్టీ వ్యక్తి మీద కూడా దాడులు జరగకూడదు అని ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. టిడిపి నేతలు టాక్స్ ల రూపం లో దోచుకున్నారు. కె టాక్స్ తో జనాలను భయ బ్రాంతులకు గురిచేశారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు సాధించింది శూన్యం. వైసీపీ మీద జగన్ మీద నిందలు వేస్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. గన్నవరం విమానాశ్రయం లో చంద్రబాబు ని చెక్ చేస్తే తప్పుపడుతున్నారని అన్నారు. ఇది మొదటి సారి కాదు.రెండోసారి చంద్రబాబు కి జరగటం. ఏవియేషన్ లో జడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు కి లేదు. ప్రతిపక్ష నేతకు ఆహోదా లేదు. టిడిపి నేతలు రూల్స్ తెలుసుకోవాలి. నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం,ఆ ఆశయంతో నే జగన్ గారు పనిచేస్తున్నారు.
అన్నివర్గాల ప్రజలు సుఖం గా ఉండేలా పరిపాలన సాగుతుంది. వెనుకబడిన వర్గాలకు అధికారం లో సమాన ప్రాధాన్యం ఇచ్చాం. వైసీపీ పోరాటమే ప్రజాస్వామ్య వ్యవస్థని రక్షించాలని,ఫిరాయింపులను మేము ప్రోత్సహించమని అన్నారు. ఎవరిని కూడా దొడ్డిదారిన తీసుకొము.మా పార్టీలోకి ఎవరు రావాలన్న పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని అయన స్పష్టం చేసారు.