ఇటీవల వచ్చిన 'అ!' సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయిక ఈషా రెబ్బా త్వరలో తేజ దర్శకత్వంలో నటించనుంది. వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే' పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో ముఖ్య పాత్ర పోషించే నారా రోహిత్ సరసన ఈషాను ఎంచుకున్నట్టు సమాచారం.