YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెంకన్న కు విలువైన కానుక

వెంకన్న కు విలువైన కానుక

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలకు కొదువేలేదు. తమ కోర్కెలు నేరవేరాలని హుండీలో తోచినంత వేసి మొక్కు చెల్లించుకుంటారు.  స్వామికి భక్తులు ఇచ్చే కానుకులను మాత్రం లెక్కగట్టేందుకు కొన్ని శాసనాలు రికార్డులు ఉన్నాయి. ఒకప్పుడు దాతలు ఇచ్చిన కానుకలే స్వామి సేవలకు వినియోగించేవారు.   కైంకర్యాలు మొదలుకుని, ఆభరణాల వరకూ చాలా సామాగ్రి దాతలు ఇచ్చినవే కావడం విశేషం. ఈ కానుకలకు చరిత్ర ఉంది.  ఇలా తొలికానుక ఇచ్చిన వారు పల్లవరాణి సమువాయిగా చెబుతున్నారు. సమువాయి స్వామికి పరమభక్తురాలు. ఆమె తరచూ శ్రీవారిని దర్శించుకునేవారు.  అలా అక్కడ స్వామి సేవకు కావలసిన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే ఆమె కీ.శ.614లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తయారు చేయించి ఆలయానికి బహుకరించారు. నాటి పల్లవుల నుంచి రాయల వరకు ఎన్నో కానుకలను ఇచ్చారు. తాజాగా శ్రీవారికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు విరాళాన్ని అందజేశాడు. రూ.2.25 కోట్ల విలువైన 6 కేజీల కటిక, అభయ హస్తం విరాళంగా ఇచ్చాడు.

Related Posts