యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గుంటూరు జిల్లా నరసరావుపేట లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులపై కేసులు పెట్టె విషయంలో ఎవరు కూడా రాజీపడటం లేదు. ఇప్పటికే సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పదికి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు తెరపైకి రావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గత పది రోజుల నుంచి నరసరావుపేట లో కోడెల కుటుంబ సభ్యులపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుడమురు నాగరాజు అనే క్రికెట్ రంజీ ప్లేయర్ దగ్గర రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని ఫెక్ సర్టిఫికెట్ ఇచ్చి 15 లక్షలు దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడెల శివరాం పై కేసు నమోదు చేయాల్సిందిగా రూరల్ ఎస్పీ ఆదేశాలు జారీ చేసారని బాధితుడు తెలిపారు.