యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పాల్సిందే అని జూనియర్ డాక్టర్లు పట్టుమీదున్నారు. చర్చలకు రావాలంటూ దీదీ ఆహ్వానించినా.. జూడోలు దాన్ని తిరస్కరించారు. దీంతో అయిదు రోజులుగా డాక్టర్లు చేస్తున్న సమ్మెపై ప్రతిష్టంభన ఇంకా తొలగలేదు. ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఇటీవల ఇద్దరు డాక్టర్లపై జరిగిన దాడికి నిరసనగా జూడోలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బెంగాల్ డాక్టర్లకు మద్దతుగా అన్ని రాష్ట్రాల్లోనూ డాక్టర్లు ఉద్యమబాట పట్టారు. సోమవారం దేశవ్యాప్తంగా సమ్మె కూడా చేయనున్నారు. మేం సెక్రటేరియేట్ వెళ్లడం లేదు, సీఎం మమతా బెనర్జీనే నీల్ రతన్ సిర్‌కార్ మెడికల్ కాలేజీకి రావాల్సి ఉంటుందని, అక్కడకు వచ్చి ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.