YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సెప్టిక్ ట్యాంక్ లో దిగి ఏడుగురు మృతి

సెప్టిక్ ట్యాంక్ లో దిగి ఏడుగురు మృతి

హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలు తీసింది. సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేసేందుకు వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ రాకపోవడంతో అతడిని వెతుక్కుంటూ ఒక్కొక్కరుగా దిగిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌లో మొదట చిక్కుకున్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. వడోదరలోని దభోయిలో ఉన్న దర్శన్‌ హోటల్‌ యాజమాన్యం సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన చేసేందుకు కూలీలను రప్పించింది. ముందుగా ట్యాంక్ లోనికి వెళ్లాడు. అతడు ఎంతసేపటికీ రాకపోకపోవడంతో మిగిలిన ముగ్గురు అతడిని వెతుక్కుంటూ లోనికి వెళ్లారు. వారు కూడా ఎంతసేపటికి రాకపోవడంతో హోటల్ సిబ్బంది ముగ్గురు వెళ్లారు. సెప్టిక్ ట్యాంక్ లోనికి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాకపోవడంతో ఆందోళన పడిన హోటల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు, మున్సిపల్ సిబ్బందికి సమాచారమిచ్చింది. వారంతా వెంటనే అక్కడికి చేరుకుని సెప్టిక్ ట్యాంక్‌లో నుంచి ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను అజయ్ వాసవ(22), సహదేవ్ వాసవ(22), బ్రిజేష్ హరిజన్(23), మహేశ్ హరిజన్(25), అశోక్ హరిజన్(45), మహేశ్ పటాన్‌వాడియా(47), చౌదరిగా గుర్తించారు. ట్యాంక్‌లోని విష వాయువుల వల్లనే వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 

Related Posts