YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

సరికొత్త శిఖరాలకు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

సరికొత్త శిఖరాలకు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

మార్కెట్‌ మరో చరిత్ర

35000 దాటిన సెన్సెక్స్‌.. నిఫ్టీ @ 10788

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త సంవత్సరంలో సరికొత్త శిఖరాలకు చేరాయి. కరెక్షన్‌ భయాల నడుమ కొనసాగుతున్న బుల్‌ స్వైర విహారంతో సెన్సెక్స్‌ బుధవారం 35000 మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించింది. నిఫ్టీ ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయి 10788 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ షేర్లు దుమ్ము రేపాయి. ఎఫ్‌ఎంసిజి, ఐటి స్టాక్స్‌ చెలరేగిపోయాయి. మార్కెట్లో ఎటు చూసినా ఆశావాదమే తాండవిస్తోంది. బుల్‌రన్‌ పతాకస్థాయిలో ఉన్నట్టు మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. రెగ్జిట్‌, బ్రెగ్జిట్‌, నోట్ల రద్దు, జిఎ్‌సటి.. ప్రతికూలమని భావించిన ఏ పరిమాణాన్ని మార్కెట్‌ లెక్కలోకే తీసుకోవడం లేదు. 2018-19 వార్షిక బడ్జెట్‌ మరో రెండు వారాల్లో పార్లమెంట్‌ ముందుకు రానున్న నేపథ్యంలో ఈ ప్రీబడ్జెట్‌ జోష్‌ కొనసాగుతుందన్న ధీమా మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

 స్టాక్‌ మార్కెట్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నితాకాయి. కీలక సూచీలు బుధవారం రాకెట్‌లా దూసుకుపోయి సరి కొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 310 పాయింట్ల లాభంతో పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 35081 పాయింట్ల వద్ద ముగిసింది. ద్రవ్యలోటుపై భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మార్కె ట్‌ నిధుల సమీకరణ లక్ష్యాన్ని తగ్గించుకుంటున్నట్టుగా ప్రకటించడంతో మార్కెట్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.

గతంలో 50 వేల కోట్ల రూపాయల అదనపు నిధులను మార్కెట్‌ నుంచి సమీకరించనున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని 20 వేల కోట్ల రూపాయలకు తగ్గించుకుంది. ఆర్థిక రంగం మెరుగ్గా ఉండటం వల్లనే ప్రభుత్వం అప్పు లక్ష్యాన్ని తగ్గించుకుందన్న భావనతో మార్కెట్‌ను ఉత్తేజపరిచింది. ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు ఆపరేటర్లు ఎడాపెడా కొనుగోళ్లు జరిపారు. ప్రధానంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు భారీ ఎత్తున జరిగాయి. గురువారం నాడు జరిగే జిఎ్‌సటి కౌన్సిల్‌ సమావేశంలో మరికొన్ని సరుకులు సర్వీసులపై పన్ను రేట్లను తగ్గించడంతో పాటు విధానాలను సరళతరం చేయనున్నారన్న వార్తలు కూడా మార్కెట్‌ను ఉత్తేజపరిచాయి. ఈ పరిణామాలకు తోడుగా లిక్విడిటీ దండిగా ఉండటం, క్యూ 3 ఫలితాలు ఆశాజనకంగా ఉండటం కూడా మార్కెట్‌కు కలిసివచ్చాయి. ఇప్పుడందరూ 40 వేల టార్గెట్‌ గురించి మాట్లాడుతున్నారు.

 డిసెంబరు 26న 34000 మార్క్‌ను తాకిన సెన్సెక్స్‌ సరిగ్గా 17 ట్రేడింగ్‌ సెషన్స్‌లో 1000 పాయింట్ల లాభంతో 35000 పాయింట్ల స్థాయికి చేరింది. నిఫ్టీ ఇంట్రాడేలో కొత్త గరిష్ఠ స్థాయి 10803 పాయింట్లను తాకింది.

ఎస్‌బిఐ, యాక్సిస్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, బిఒబి మెరుపులు మెరిపించాయి. పిఎస్‌యు బ్యాంకుల సూచీ 4.2 శాతం పెరిగింది. హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మాత్రం స్వల్పనష్టాలతో ముగిసాయి.

ఎఫ్‌ఎంసిజి, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 50 స్టాక్స్‌లో 38 లాభంతోనే క్లోజయ్యాయి.

స్టాక్‌ మార్కెట్‌ జోష్‌కు ఎనలిస్టులు చెబుతున్న కారణాలు..

దేశ ఆర్థిక రంగంపై దేశ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పాదుకోవడం

గత నాలుగేళ్లలో ప్రభుత్వం తీసుకున్న కీలక సంస్కరణలు సత్‌ఫలితాలను ఇస్తున్నాయి. ఆర్థిక రంగంలో మళ్లీ పునరుత్తేజం మొదలైంది.

 ఇప్పటి వరకు వెలువడిన క్యూ3 ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. భవిష్యత్తులోనూ రాబడుల్లో వృద్ధి ఉంటుంది.

 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు ఉంటాయి.

నిఫ్టీ టార్గెట్‌ 11800

ఎన్‌ఎ్‌సఇ ప్రధాన సూచిక నిఫ్టీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.15 శాతం ఆదాయాల వృద్ధితో 11800 పాయింట్లను చేరుతుందని హెచ్‌డిఎ్‌ఫసి సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. 2016-17లో నిఫ్టీ ఆదాయాల వృద్ధి 10.4 శాతం ఉండగా మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో 13.5 శాతం ఉండవచ్చునని తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు 7.3 శాతం ఉండవచ్చని, తయారీ రంగం పిఎంఐ పుంజుకోవడంతో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవన్నీ స్టాక్‌ మార్కెట్‌ వృద్ధికి దోహదపడే అంశాలని ఆయన అన్నారు.

 

మార్కెట్లో ఎల్లెడలా ఆశావాదమే కనిపిస్తోంది. అంద రూ కొత్త గరిష్ఠ స్థాయిల గురించే మాట్లాడుతున్నారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ ఎత్తున నిధులను మార్కెట్లోకి గుమ్మరిస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా నేను మాత్రం, అప్రమత్తంగానే ఉండాలని భావిస్తున్నాను. ఈ దశలో కొత్త పొజిషన్స్‌ తీసుకోవాల్సిందిగా సిఫారసు చేయను

- నిఖిల్‌ కామత్‌, జెరోధా ఫౌండర్‌ హెడ్‌

అంతర్లీన సెంటిమెంట్‌ ఆశాజనకంగానే ఉన్నప్పటికీ కీలకసూచీలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిని చేరిన కారణంగా ఇప్పుడు జాగ్రత్తగానే వ్యవహరించాలి. క్యూ 3 ఫలితాలే కీలకం. విడిగా స్టాక్స్‌ను బట్టి మార్కెట్లో యాక్షన్‌ ఉంటుంది. మార్కెట్‌ భవిష్యత్‌ దిశను ఇదే నిర్ణయిస్తుంది.

జయంత్‌ మంగ్లిక్‌, రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌

Related Posts