యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్వితీయ విజయం సాధించింది. దాయాది జట్టును 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఆ జట్టుపై ఇది ఏడో విజయం. సీనియర్లు కొనసాగిస్తున్న రికార్డును కోహ్లీసేన మరింత ముందుకు తీసుకువెళ్లింది. వర్షం కారణంగా పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లకు 302గా నిర్ణయించారు. టీమిండియా బౌలర్లు విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్ తలో రెండు వికెట్లతో దెబ్బకొట్టడంతో పాక్ 212/6కు పరిమితమైంది. ఫకర్ జమాన్ (62), బాబర్ ఆజామ్ (48), ఇమాద్ వసీమ్ (46*) రాణించారు. అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ(140; 113బంతుల్లో 14×4, 3×6) శతకంతో, కోహ్లీ (77; 65 బంతుల్లో 7×4), కేఎల్ రాహుల్ (57; 78 బంతుల్లో 304, 2×6) దూకుడుగా ఆడటంతో భారత్ 336 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 35 ఓవర్లకు 166/6తో నిలిచింది. ఆ సమయంలో వర్షం కురిసింది. దీంతో లక్ష్యాన్ని కుదించారు.