YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో సీనియార్టీ లొల్లి

ఏపీలో  సీనియార్టీ లొల్లి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కొంత వయసు వచ్చాక రిటైర్మెంట్ అన్నది అందుకే. తరాలు మారుతాయి. ఆలొచనలు కూడా మారుతాయి. పెద్దతరం వాళ్ళకు యువతరం భావాలు వెకిలిగా కనిపిస్తాయి. ఇక వర్తమాన తరంలో ఉన్న వారికి పాతవారి పోకడ చాదస్తంగా మారుతుంది. దీంతో మర్యాద ఇవ్వడం లేదు, నా సీనియారిటీని  గౌరవించడంలేదు, ఇలా మధనపడుతూ స్వీయ అవమానం చెందుతూ పెద్దలు క్రుంగిపోతూంటారు. మానసిక శాస్త్రవేత్తలు కూడా ఈ పరిణామాలను గమనినించే  పెద్దలు అన్న వారు హద్దులు దాటకుండా బుద్దిగా ఉండాలని చెబుతున్నారు. అంటే వారి మర్యాద వారి చేతుల్లోనే ఉంచుకోవాలన్నమాట. ఏపీలో కొలువుతీరిన కొత్త అసెంబ్లీ రూపు రేఖలు చూశాక నారా చంద్రబాబునాయుడు సీనియర్ మోస్ట్ సిటిజన్ అయ్యాడన్న ఆలోచన అందరిలో కలుగుతుంది. అక్కడ ఉన్న వారిలో అధికులు 55 బిలో ఏజ్ గ్రూపు. చంద్రబాబు తో సమకాలీనులు అయిన వారు తమ్మినేని సీతారాం, పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, పిల్లి  సుభాష్ చంద్రబోస్ వంటి వారే ఉన్నారు. వీరంతా మంత్రులుగా, స్పీకర్ గా అధికారంలో కుదురుకున్నారు. అందువల్ల వారికి బాధ లేదు.  ఇక బాబు విషయానికి వస్తే బడాయి ఎక్కువ. ఆయనకు అవమానకరమైన ఓటమి కూడా తాజా ఎన్నికల్లో ప్రజలు  ఇచ్చారు.నిన్నటి వరకూ బాబు గొప్పగా చెప్పుకునే ఈ పదం ఇపుడు వైసీపీ వారి నోట్లో పడి వెటకరమైపోయింది. మాటకు వస్తే చాలు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అంటాడు అంటూ చంద్రబాబును ఏకి పారేస్తున్నారు. వెటకారం ఆడుతున్నారు. బాబు సైతం ఈ ర్యాగింగ్ అనుభవాన్ని తొలిరోజే చవి చూశారు. అయినా సరే ఆయన అమాయకత్వంలో, ఆర్భాటమో తెలియదు కానీ సభ మొత్తం  అందరిలోనూ నేను సీనియర్ని అంటూ చెప్పుకొస్తున్నారు. అయినా బాబు గారి గోల పట్టించుకున్న వారు లేరు. సీనియారిటీకి మర్యాద కావాలంటే తగినట్లుగా మసలుకోవాల్సిఉంటుంది. వయసులో  కొడుకు సమానుడైన జగన్ సీఎం గా ఉంటే చంద్రబాబు ప్రతిపక్షంలో మూలన కూర్చోవడం ఆయనకే కాదు చూసే వారికి కూడా బాగులేదు. చంద్రబాబు జగన్ తండ్రి వైఎస్సార్ సమకాలీనుడు. ఆ తరంలో ఉన్న వారంతా ఇపుడు రాజకీయంగా రిటైర్ అయిపోయారు. బాబు కి వారసుడు లోకేష్ అందివస్తే అలాగే చేసేవారు కానీ మంగళగిరిలో ఓటమిపాలు కావడంతో తానే విపక్ష స్థానంలోకి రావాల్సివచ్చింది.ఇపుడున్న పరిస్తితుల్లో బండ మెజారిటీతో అసెంబ్లీలో వైసీపీ ఉంది. ఆ పార్టీలో బాబు బాధితులు మొత్తానికి మొత్తంగా  అక్కడ ఉన్నారు. వారికి ఇదే అవకాశం. బాబు నోరు తెరచి ఏది మాట్లాడినా కౌంటర్ ఇచ్చేందుకు  పది మంది  తయారుగా ఉంటారు. ఈ గోల ఆగాలంటే బాబు సీనియారిటీకి మన్నన దక్కాలంటే ఆయన సభా కార్యక్రమాలకు దూరంగా ఉంటేనే మేలు. ఉప నాయకులకు బాద్యతలు అప్పగించి కీలక సమయాల్లో హాజరయ్యేలా చూసుకోవాలి. అదే సమయంలో పార్టీ అధినేతగా ఆయన తన సమయాని వెచ్చిస్తే మంచిది. ఎటూ ఫిరాయింపులు ఉండవని జగన్ అభయం ఇచ్చారు కనుక బాబుకు ఆ చింత అసలు అవసరం లేదు. ఇదే సీనియారిటీని కాపాడుకునే మార్గం. మరి బాబు ఆ పని చేయగలుగుతారా.లేక అసెంబ్లీకి వచ్చి కుర్ర ఎమ్మెల్యేలతో నేనే సీనియర్ అంటూ వాదాలకు దిగుతారా అన్నది చూడాలి

Related Posts