యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీ అధినేతకు రాజకీయ అనుభవం లేదని నిన్నటిదాకా చాలా మంది అనుకున్నారు. ఒక్క విజయంతో ఆయన తానేంటో రుజువు చేసుకున్నారు. అపర చాణక్యుడు చంద్రబాబుని ఢీ కొట్టి పడకొట్టిన తరువాత జగన్ పొలిటికల్ ఇమేజ్ ఆకాశానికి తాకింది. జగన్ సాధించిన ఈ విక్టరీని చూసి జాతీయ పార్టీలకే కళ్ళు చెదిరాయి. మోడీ లాంటి అజేయుడు జగన్ని చూసి అచ్చెరువు చెందారు. అమిత్ షా అయితే మురిసిపోయి తమతోనే జట్టు కట్టమన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ అటు పాలనలోనూ, ఇటు రాజకీయంలోనూ వేస్తున్న దూకుడుగా అడుగులు ప్రత్యర్ధులకు షాక్ లాంటివే. ఎక్కడికక్కడ చెక్ పెట్టేలా సాగుతున్న జగన్ వ్యూహం బహుముఖీయమైనది. దీర్ఘకాలికమైనది.తిరుపతి పర్యటనకు వచ్చిన భూతద్దంలో ప్రధాని మోడీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఏపీలో 2024లో మనమే గెలవాలని పిలుపు ఇచ్చారు. ఇది సహజమైన పరిణామమైనా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దీన్ని బూతద్ధంలో చూశారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రలో పాగా వేయడానికి బీజేపీ చూస్తోందని, తెలుగు రాష్ట్రాల సీఎం లూ బహు పరాక్ అని హెచ్చరించారు. ఈ సంగతి ఇలా ఉంటే జగన్ చెవిన సైతం ఈ రకమైన మోడీ పిలుపు వినిపించి ఉంటుంది ఆయన దీనికి ఏం చేస్తారో అని అంతా భావిస్తున్న వేళ ఏపీలో ఫిరాయింపులు ఉండవు, మేము ఎవరినీ తీసుకోం, ఎవరైనా తీసుకున్నా వూరుకోం అంటూ అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన సంచలన ప్రకటన బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ లాంటిదే. ఎందుకంటే ఏపీలో ఫిరాయింపులతోనే జీవం పోసుకోవాలని, 15వ అసెంబ్లీలో ఉనికి కోల్పోయిన తమ పార్టీని ఆ విధంగా మనుగడలో ఉంచుకోవాలని కమలనాధులు పన్నుతున్న వ్యూహాలకు జగన్ చేసిన ఒక్క ప్రకటన తల్లకిందులు చేసినట్లయింది.ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. బలంగా వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉంది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ నుంచి తమవైపుకు వస్తానన్న వద్దు అని జగన్ అంటున్నారు. అదే తన సిధ్ధాంతం అని బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఇక బీజేపీలోకి వెళ్ళడానికే తమ్ముళ్ళు మొగ్గు చూపుతున్నారు. కేంద్రంలో ఎటూ అధికారంలొ ఉంది. అందువల్ల ఆ పార్టీ నీడన తలదాచుకోవాలనుకుంటున్న ఎమ్మెల్యే తమ్ముళ్ళకు ఇపుడు జగన్ ప్రకటన నిండే ముంచేసేదే. పార్టీ మారితే ఏకంగా అసెంబ్లీ స్పీకర్ వేటు వేయాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాక రాజకీయాల్లొ తలపండిన తమ్మినేని సీతారాం అసలే వూరుకోరు. ఇలా బీజేపీలోకి జంప్ చేస్తే అలా ఎమ్మెల్యే డిస్ క్వాలిఫై అయిపోతారు. ఓ విధంగా ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తన విన్యాసాన్ని చూపించాలనుకుంటున్న బీజేపీకి ఇది శారాఘాతమే. ఈ పరిణామంతో ఏపీలో బీజేపీ ఎదగకుండా జగన్ గట్టిగానే చెక్ పెట్టేశారని అంటున్నారు.