YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆన్ లైన్ లో డిస్కౌంట్ అంటూ మోసం

ఆన్ లైన్ లో డిస్కౌంట్ అంటూ మోసం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

డిస్కౌంట్ పేరుతో మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఎమ్.ఆర్.పిపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ ఆన్ లైన్ అడ్డాగా రూ.5.03 లక్షలు కొట్టేశారు. బాధితుని ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి వివరాలు చెప్పారు.మాదాపూర్ కి చెందిన ఓ వ్యాపారికి ఈ నెల 15న హెచ్ పీ మోటక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీ అయిన మౌంట్ బ్లాక్ ప్రొడక్ట్స్ ను ఎమ్.ఆర్.పి రేట్ల కంటే 60 శాతం డిస్కౌంట్ తో అమ్ముతున్నట్టు ఆ మెసేజ్ లో ఉంది.   మౌంట్ బ్లాక్ ఇంటర్నేషనల్ కంపెనీ కావడంతో రూ.లక్షలు విలువ చేసే వస్తువులు తక్కువ ధరలో కొనచ్చని ఆ వ్యాపారి భావించాడు. ఆ వ్యాపారి మెసేజ్ లో వచ్చిన వెబ్ సైట్ లింక్ ను ఓపెన్ చేశాడు. తనకు కావాల్సిన రూ.లక్షలు విలువ చేసే పెన్నులు, పర్సులు, బెల్ట్ లను సెలక్ట్ చేసుకున్నాడు. వాటి మొత్తం ఎమ్.ఆర్.పి విలువ రూ.12లక్షలు కాగా..ఆ సంస్థ చెప్పిన విధంగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.5లక్షల3వేల140గా పేమెంట్ ఆర్డర్ వచ్చింది.తాను సెలక్ట్ చేసుకున్న వస్తువుల డెలివరీ వివరాలను తెలుసుకునేందుకు ఆ వ్యాపారి సంస్థ కస్టమర్ కేర్ కు కాల్ చేశాడు. కాల్ రిసీవ్ చేసుకున్న టెలీకాలర్స్ రూ.5లక్షల3వేల140 చెల్లించిన తర్వాతే ప్రొడక్ట్స్ డెలివరీ అవుతాయని చెప్పారు. ఈ నెల 12న క్రెడిట్ కార్డుల ద్వారా ఆ వ్యాపారి మొత్తం డబ్బు ఆన్ లైన్ లో చెల్లించాడు. పేమెంట్ అయిన 3 రోజుల్లోనే ప్రొడక్ట్స్ డెలివరీ అవుతాయని చెప్పడంతో వ్యాపారి వాటి కోసం ఎదురుచూస్తున్నాడు. తాను ఈ కామర్స్ సైట్ లో ఆర్డర్ పెట్టిన విషయాన్ని ఫ్రెండ్స్ కు చెప్పాడు.  ఈ సంస్థ డిస్కౌంట్స్ పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతోందని అతడి ఫ్రెండ్స్ వ్యాపారికి చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన ఆ వ్యాపారి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. బాధితుడి కంప్లయింట తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వెబ్ సైట్లు, ఈ కామర్స్ సైట్లలో వచ్చే ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సూచించారు.

Related Posts