యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వం పాలసీ డాక్యుమెంట్ అని అందరికీ తెలిసిందేనని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. కొత్తగా అధికారంలోకి వచ్చాక జరుగుతున్న సమావేశంలో చదివిన ప్రసంగమది అని పేర్కొన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సును ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం ఉంటుందని భావించానన్నారు. ఐదేళ్ల అభివృద్ధిపై గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. వైసీపీ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే భ్రమలో ఉన్నారన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుభవం తక్కువ అన్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. ఢిల్లిలో పోలవరం కేంద్రం తీసుకుంటుందన్నారు… అమరావతికి వచ్చాక పోలవరం మేమే పూర్తి చేస్తామని జగన్ అన్నారన్నారు. పట్టిసీమ పనికి వచ్చే ప్రాజెక్టు కాదనుకుంటే మూసివేయండన్నారు. ఏపీ అన్ని రంగాల్లో ముందుందని ప్రధాని మోడీ జగన్కు చెప్పారని, అటువంటి అభివృద్ధినే కొనసాగించాలని మోడీ జగన్కు చెప్పారన్నారు. కొత్త ప్రభుత్వం పాలన మీద దృష్టి పెడితే మంచిదన్నారు.
తెలుగుదేశం హాయంలో రాష్ట్రంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని మంత్రి అనిల్కుమార్యాదవ్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… నీరు-చెట్టు ప్రాజెక్టులో, ధర్మపోరాట దీక్ష పేరుతో, పోలవరం నిర్మాణంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్నారు. అందుకే ఆ పార్టీ నుంచి కేవలం 23 మందే గెలిచారని అన్నారు. వీరందరినీ ‘ఆలీ బాబు.. 23 దొంగలు’ అని సంబోధించారు మంత్రి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సమర్థవంతమైన పాలన అందించిందని, కాని కొన్ని కారణాల వల్ల ఓడిపోయామని అచ్చెన్నాయుడు చెప్పారు.